• తాజా వార్తలు
  •  

ఆరు నెల‌ల్లో ఇంట‌ర్ ఆప‌ర‌బుల్ కానున్న మొబైల్ వాలెట్లు.. దీనిలో మంచి ఎంత‌?  చెడు ఎంత‌? 

పేటీఎం, మొబీక్విక్‌, ఫ్రీ ఛార్జి .. ఇలా ఎన్నో మొబైల్ వ్యాలెట్లు.. డీమానిటైజేష‌న్ త‌ర్వాత ఇండియాలో బాగా వాడుక‌లోకి వ‌చ్చాయి. ఇంచుమించుగా అంద‌రూ రెండు, మూడు ర‌కాల మొబైల్ వాలెట్లు వాడుతున్నారు.  కొన్ని ట్రాన్సాక్ష‌న్లు పేటీఎంలో చేస్తే క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. మ‌రికొన్నింటికి ఫ్రీఛార్జిలో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది.  ఇంకొన్ని ఫ్రీఛార్జిలో చేస్తుంటాం. కానీ వీటి ట్రాన్సాక్ష‌న్స్‌, క్యాష్‌బ్యాక్‌లు, బ్యాల‌న్స్‌లు అన్నీ విడివిడిగానే ఉంటాయి. వీట‌న్నింటినీ క‌లిపి ఒకే ఫ్లాట్‌ఫాంగా వాడుకోగ‌లిగితే చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్‌గా, యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అందుకే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ  వైపు స్టెప్స్ తీసుకుంది. అన్ని మొబైల్ వాలెట్లు ఆరు నెల‌ల్లోగా ఒక‌దానితో ఒక‌టి ఇంట‌ర్ ఆప‌ర‌బుల్ కావాల‌ని ఆర్డ‌ర్స్ పాస్ చేసింది. 

యూపీఐకి లింక‌ప్ 
2018 ఏప్రిల్ లోగా మొబైల్ వాలెట్ల‌న్నీ లింక‌ప్ (ఇంట‌ర్ ఆప‌రబుల్‌) చేయాల‌ని ఆర్‌బీఐ నిర్ణ‌యించింది. ఇందుకోసం యూపీఐని ఉప‌యోగించుకోబోతున్నారు. దీంతో యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్ష‌న్లు కూడా పెరిగిన‌ట్ల‌వుతుంది. 
లాభ‌మేంటి? 
 * వాలెట్లు ఇంట‌ర్ ఆప‌ర‌బుల్ అయితే పేటీఎం లో ఉన్న ఫండ్స్ ఫ్రీ ఛార్జ్‌లో వేసుకోవ‌చ్చు. మొబీక్విక్‌లో ఉన్న ఎమౌంట్‌ను పేటీఎంలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇలా ఒక‌దాని నుంచి ఒక వాలెట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోగ‌లిగితే యూజ‌ర్‌కు చాలా యూజ్‌ఫుల్‌.
* ఫ‌లానా వాలెట్  నా ఫోన్‌లో లేదు అని ఏ వ్యాపారీ మీ వాలెట్ ట్రాన్సాక్ష‌న్‌ను రిజెక్ట్ చేసే అవ‌కాశాలు త‌గ్గుతాయి.  ఎందుకంటే ఒక్క వాలెట్ ఉన్నా స‌రిపోతుంది.
* ఒక వాలెట్ నుంచి మ‌రో వాలెట్‌కు ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు కాబ‌ట్టి యూజ‌ర్‌ను త‌న వాలెట్‌లో మ‌నీ ఉంచేలా చేయాలంటే వాలెట్ కంపెనీలు మ‌రిన్ని ఆఫ‌ర్లు తెస్తాయి. క్యాష్ బ్యాక్‌లు పెంచుతాయి.  ఈ కాంపిటీష‌న్ పెరిగి యూజ‌ర్‌కు మ‌రింత లాభం   

జన రంజకమైన వార్తలు