• తాజా వార్తలు
  •  

2018లో మ‌నం షాపింగ్ చేసే విధానాన్ని జియో స‌మూలంగా మార్చ‌బోతోంది.. బీ రెడీ

టెలికం రంగంలో సంచల‌నాల‌కు మారుపేరుగా నిలిచింది జియో. అప్ప‌టి దాకా తాము చెప్పిందే టారిఫ్‌, తాము ఇచ్చిందే స‌ర్వీస్ అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించిన మిగిలిన టెలికం కంపెనీల‌న్నింటినీ నేల‌కు దించింది. భారీ ఆఫ‌ర్లు, మంచి నెట్‌వ‌ర్క్‌తో మార్కెట్‌ను కుమ్మేసింది. ఇప్పుడు ఆ జియో అస్త్రాన్నేఈ కామ‌ర్స్ రంగంలో ప్ర‌యోగించ‌బోతున్నారు ముకేశ్ అంబానీ. జియోకున్న కోట్ల మంది యూజ‌ర్లే అండ‌గా ఈకామ‌ర్స్‌లో స‌రికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేసేశారు. ఈ దెబ్బ‌తో ఇప్ప‌టికే ఈకామ‌ర్స్‌లో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థ‌లు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కొత్త దారులు వెతుక్కోవాల్సిందేనంటున్నారు మార్కెట్ ఎక్స్‌ప‌ర్ట్‌లు.   
ఏమిటా వ్యూహం?
ఇండియాలో రిటైల్ బిజినెస్ 414 కోట్ల కోట్ల రూపాయ‌లు. అందులో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఈకామ‌ర్స్ కంపెల‌న్నీ క‌లిపి లాక్కోగ‌లిగింది జ‌స్ట్ 3-4%. మిగిలిన 96%  వ్యాపారం చిన్నాచిత‌కా కిరాణా కొట్ల నుంచి సూప‌ర్ మార్కెట్లు, మాల్స్ వ‌ర‌కు న‌డుస్తుంది. ఈ బిజినెస్‌లో పాగా వేయాలంటే వాటితోసున్నం పెట్టుకోకూడ‌దు. ఆ చిన్న చిన్న దుకాణాల‌నే త‌న బిజినెస్‌కు ఫ్లాట్‌ఫాంగా మార్చుకోవాల‌ని అంబానీ ప్లాన్ చేస్తున్నారు. బ్రాండ్ల‌తో టైఅప్ అయి వారిచ్చే కూప‌న్ల‌ను జియో యూజ‌ర్లకు ఇవ్వడం, వారు దాంతో ఆ బ్రాండ్ వ‌స్తువుల‌ను త‌మ దగ్గ‌రున్న చిన్న చిన్న దుకాణాల్లో కొనుక్కుని డిస్కౌంట్ పొందడం.. ఇదీ ప్లాన్‌. కంపెనీలు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా దాన్ని పాంప్లేట్ల నుంచి పేప‌ర్ యాడ్స్ వ‌ర‌కు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌చారం చేయాలి. అదే కోట్ల మంది జియో యూజ‌ర్ల‌కు నేరుగా డిస్కౌంట్ కూప‌న్స్ రూపంలో ఇస్తే ఈజీగా రీచ్ అవుతుంది క‌దా.. 
ఎలా చేస్తారంటే..
ఇప్ప‌టికే రిలయ‌న్స్ అహ్మ‌దాబాద్‌, చెన్నైల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. జియో యూజ‌ర్లకు జియో మ‌నీ ప్లాట్‌ఫాం మీద కంపెనీలు, బ్రాండ్స్ ఎల‌క్ట్రానిక్స్ వోచ‌ర్స్ రూపంలోగానీ, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలోగానీ డిస్కౌంట్ కూప‌న్లు ఇస్తాయి. వీటిని జియో యూజ‌ర్లు ఆ బ్రాండ్ వ‌స్తువులు కొనుక్కునేట‌ప్పుడు కిరాణా దుకాణాల్లో కూడా రిడీమ్ చేసుకుని డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. 
క‌స్ట‌మ‌రే కింగ్‌
ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లాంటి ఈ కామ‌ర్స్ కంపెనీలు ఇప్పుడు వ్యూహం మార్చుకోవాలి.  ఎందుకంటే జియోకు కోట్ల మంది యూజ‌ర్లున్నారు. అంత‌పెద్ద నెట్‌వ‌ర్క్‌ ఈ కంపెనీల‌కు లేదు.  ఇలాంటి డిస్కౌంట్ కూప‌న్లు, వోచ‌ర్ల తో  ఆఫ్‌లైన్‌లో కొనుక్కోవడానికి  మొగ్గు చూప‌కుండా ఉండాలంటే ఈ కామ‌ర్స్ కంపెనీలు అంత‌కంటే భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వాల్సి వ‌స్తుంది. దాదాపు ప‌దేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నా గ్రామీణ ప్రాంతాల‌కు బిజినెస్‌ను చేర్చ‌లేక‌పోయిన ఈకామ‌ర్స్ కంపెనీల‌కు ఇది పెద్ద టాస్కే. అయితే  జియో రాక‌తో మొబైల్ టారిఫ్ త‌గ్గిన‌ట్టే ఇప్పుడు ఈకామ‌ర్స్ ఈరిటెయిల్‌లోనూ క‌స్ట‌మ‌రే లాభం పొంద‌డం మాత్రం ఖాయం.

జన రంజకమైన వార్తలు