• తాజా వార్తలు

మొబైల్ యాప్ ద్వారా ఖర్చు చేయడం తగ్గిందట

డీమానిటైజేషన్ తో మొబైట్ వ్యాలెట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. బ్యాంకు ఖాతాల కంటే వ్యాలట్ ఖాతాలు ఎక్కువైపోయాయి. వ్యాలట్ ద్వారా ఖర్చు చేయడం కూడా విపరీతంగా పెరిగింది. అయితే... డీమానిటైజేషన్ ప్రభావం తగ్గిపోగానే వ్యాలట్ల వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది.
ఖాతాదారులు పెరిగినా..
ఈ ఏడాది జనవరి తరువాత కరెన్సీ బాగా దొరకడం మొదలైంది. అయినా కూడా వ్యాలట్లకు ఖాతాదారులు బాగా పెరిగారు. కానీ.. వాటి ద్వారా ఖర్చు చేసే సగటు మొత్తం మాత్రం బాగా తగ్గిపోయింది.
ఒక కస్టమర్ పై రూ.39 తగ్గుదల
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ట్రాంజక్షన్ వేల్యూ, నంబర్ ఆఫ్ ట్రాంజాక్షన్స్ పెరిగాయి. కానీ... యావరేజి ట్రాంజాక్షన్ వేల్యూ బాగా పడిపోయింది. ఇంతకుముందు ఒక క్వార్టర్లో సగటున ఒక కస్టమర్ కు రూ.322 ట్రాంజాక్షన్ వాల్యూ ఉండగా అది ఇప్పుడు రూ.283 కి పడిపోయింది.
ముఖ్యంగా నగదు లభ్యత పెరగడంతో వ్యాలట్ల అవసరం బాగా తగ్గుతూ వస్తోంది. కేవలం ఆన్ లైన్ చెల్లింపుల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. లేదంటే చిల్లర సమస్య ఎదురైనప్పుడు, మంచి ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రం ఆఫ్ లైన్లోనూ వ్యాలట్ పేమెంట్లు చేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు