• తాజా వార్తలు

మోడీ లాటరీలో మీరు విన్నరో కాదో తెలిసిదెలా?

దేశంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు పథకాలను ప్రవేశపెట్టారు.  క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు చేసే ఖాతాదారుల కోసం   లక్కీ గ్రాహక్ యోజన ,  వీటిని అనుమతించే వ్యాపారుల కోసం డిజిధన్ వ్యాపారి యోజన అనే రెండు కొత్త పథకాలను ప్రకటించింది.  వీటికి భారీ గా నగదు బహుమతులను ప్రకటించారు. డిజిటల్ చెల్లింపులు ప్రచారం కోసం 340 కోట్ల  రూపాయలను  కేటాయించారు.  
డిసెంబర్ 25 ( క్రిస్మస్) నుంచి  ఈ ప‌థ‌కాలు అమ‌ల్లోకి వచ్చాయి. ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న కింద రోజూ 15 వేల మంది  వినియోగదారులను  ఎంపిక చేసి  బహుమతులు ఇస్తారు. డిజిధ‌న్ వ్యాపారి యోజ‌న కింద వారానికి  7వేల మంది  వ్యాపారస్తులని ఎంపిక చేసి వారికి బ‌హుమతులు అందిస్తారు.  మూడు వేల నుంచి 50 వేలలోపు ఆన్ లైన్  లావాదేవీలకు  ఈ బహుమతులు వర్తిస్తాయి.  లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన విజేతలకు  2017 ఏప్రిల్ 14న ఈ మెగా  బహుమతులను ప్రదానం చేయనున్నారు.

ఎవరు అర్హులు
యూపీఐ, రూపే కార్డులు, ఆధార్ అనుసంధానిత పేమెంట్ సిస్ట మ్స్ (ఏఈపీఎస్), యూఎస్ఎస్డీ ద్వారా పేమెంట్ చేసినవారికి మాత్రమే ఈ డ్రాల్లో బహుమతులు ఇస్తారు. పేటీఎం, మొబీక్విక్ వంటి మొబైల్ వాలెట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేవారిని ఈ పథకంలో పరిగణనలోకి తీసుకోరు.
 
వినియోగదారులకు (లక్కీగ్రాహక్ యోజన)
లక్కీగ్రాహక్ యోజన కింద ప్రతి రోజూ 15 వేల మంది వినియోగదారులు వెయ్యి రూపాయలు గెలుచుకుంటారు. వారం ప్రైజు కింద 7వేల మంది వినియోగదారులకు లక్ష, పదివేలు, ఐదు వేల వంతున బహుమతులిస్తారు.  ఏప్రిల్ 14న జరిగే మెగా డ్రాలో మూడు భారీ బహుమతులు ఉంటాయి.  
బంపర్ బహుమతులు
మొదటి  బహుమతి     కోటి రూపాయలు
రెండో బహుమతి       రూ.50 లక్షలు
మూడవ  బహుమతి   రూ.25  లక్షలు
ప్రభుత్వం మొత్తం యూఎస్ఎస్డీ పేమెంట్లు చేసినవారిలో నుంచి 100 మంది విజేతలను, యూపీఐ కింద 1500 మందిని, ఏఈపీఎస్ కింద 11,900 మంది విజేతలను ఎంపిక చేస్తుంది.

వ్యాపారులకు..  (డిజిధన్ యోజన)
7వేల మంది వ్యాపారస్తులు  డిసెంబర్ 25 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు ప్రతి వారం ప్రైజు కింద 50 వేలు, 5వేలు, 2,500 చొప్పున గెలుచుకుంటారు.  ఏప్రిల్ 14న జరిగే మెగా డ్రాలో బంపర్ బహుమతులుంటాయి.  
బంపర్ బహుమతులు
మొదటి  బహుమతి      రూ.50 లక్షలు
రెండవ బహుమతి       రూ.25 లక్షలు
మూడవ  బహుమతి   రూ.5 లక్షలు

 డ్రాలో విజేతలయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలంటే..

1.    https://digidhanlucky.mygov.in/      వెబ్ సైట్లోకి వెళ్లాలి.  
2. అక్కడ కన్జ్యూమర్, మర్చంట్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఏదైతే ఆ బటన్ పై క్లిక్ చేయాలి.
3. తర్వాత వచ్చే బాక్సులో మీ యూపీఐ, యూఎస్ఎస్డీ, రూపే, ఏఈపీఎస్  అకౌంట్ తో (వీటిలో దేనితో చెల్లిస్తే అది) లింకై ఉన్న మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
4 ఇప్పుడు మీకు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని స్క్రీన్ మధ్యలో కనిపించ బాక్సులో ఎంటర్ చేయాలి.
5. ట్రై యువర్ లక్ అనే బటన్ ను క్లిక్ చేయాలి.
6. మీరు లక్కీగ్రాహక్ యోజన లేదా డిజిధన్ యోజన కింద బహుమతి గెలుచుకున్నట్లయితే మీకు మెసేజ్ కనిపిస్తుంది.
7.మీరు డిజిటల్ పద్ధతిలో చెల్లించినా మీరు డ్రాలో గెలుపొందారో లేదో సమాచారం లభించకపోతే మీరు రూపే కార్డు వాడితే ఆ కార్డు నెంబర్, యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే వీపీఏ నెంబర్, ఏఈపీఎస్ అయితే ఆధార్ నెంబర్ వంటి వివరాలు సమర్పించి మరోసారి మొబైల్ నెంబర్ నమోదు చేస్తే మీకు డ్రాలో గెలుపొందారో లేదో సమాచారం వస్తుంది.

జన రంజకమైన వార్తలు