• తాజా వార్తలు
  •  

గ్రాస‌రీ యాప్స్ వ‌రుస‌గా ఫెయిల్ అవుతుండ‌డానికి కార‌ణాలేంటి? 

డీమానిటైజేష‌న్ డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరుగుతుండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆన్‌లైన్ షాపింగే.బ‌ట్ట‌లు, యాక్సెస‌రీస్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మొబైల్స్ వంటివ‌న్నీ ఆన్‌లైన్‌లో కొంటున్న జ‌నం గ్రాస‌రీ యాప్స్‌ను మాత్రం పెద్ద‌గా పట్టించుకోవ‌డం లేదు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన గ్రాస‌రీ యాప్స్ కూడా పెద్ద‌గా క్లిక్క‌వ‌డం లేదు. అస‌లు ఆన్‌లైన్ గ్రాస‌రీ యాప్స్ ఫెయిల‌వ‌డానికి కార‌ణాలేంటో చూడండి.   

ఇవీ కార‌ణాలు 
1. ఆన్‌లైన్ గ్రాస‌రీ యాప్స్ ఫ‌స్ట్ ప‌ర్చేజ్ మీద భారీ డిస్కౌంట్లు, ఓచ‌ర్లుఆఫ‌ర్ చేస్తుండ‌డంతో వాటిని ఫ‌స్ట్ టైం యూజ్ చేస్తున్నారు. త‌ర్వాత మ‌ళ్లీ వాటి జోలికి వెళ్ల‌డం లేదు. మ‌ళ్లీ త‌మ పాత ఆఫ్‌లైన్ గ్రాస‌రీ వెండ‌ర్స్ ద‌గ్గ‌ర‌కే వెళుతున్నారు. దీనికి కార‌ణం ఏళ్ల త‌ర‌బ‌డి వాళ్ల ద‌గ్గ‌ర‌కు స‌రుకులు కొన‌డం మూలంగా ఏర్ప‌డిన న‌మ్మ‌కం. 
2. గ్రాసరీ యాప్స్ మార్కెట్ చేయ‌డానికి పెద్ద పెద్ద సెల‌బ్రిటీల‌తో యాడ్స్ ఇస్తుండ‌డంతో మార్కెటింగ్ కాస్ట్ భారీగా పెరుగుతుంది. ఇది యూజ‌ర్‌మీదే భారం ప‌డేలా చేస్తుంది. అందుకే రెండో పర్చేజ్ నుంచి వాటి కాస్ట్‌ను, డిస్కౌంట్స్ త‌గ్గ‌డాన్ని గుర్తించి యూజ‌ర్లు యాప్స్‌కు దూరంగా జ‌రుగుతున్నారు. 
3. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయ‌డానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ చేయ‌డానికి సాధ‌నాలున్నా గ్రాసరీ యాప్స్ లేదా ఈ కామ‌ర్స్ చిన్న పట్ట‌ణాల‌కు ఇంకా పూర్తిగా చేర‌లేదు. అదీకాక ఫిజిక‌ల్‌గా ఆఫ్‌లైన్ స్టోర్‌లో చూసి కొనుక్కోవ‌డం కంటే ఆన్‌లైన్‌లో ప్ర‌తిదీ చూసి సెలెక్ట్ చేసుకో్వ‌డం కొద్దిగా ఇబ్బంది.
4. ఇండియ‌న్స్ అవుట్‌డోర్‌లో ప‌ర్చేజింగ్‌కు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. ఫ్రెష్ కూర‌గాయ‌లు, పండ్లు తాము ద‌గ్గ‌రుండి ఎంచుకుని వాటిని కొనుక్కోవడం, బేరం చేయ‌డంలో ఉన్న సంతృప్తి  ఆన్‌లైన్ యాప్స్‌లో ఉండ‌దు. ఈ సోష‌ల్ సీన్‌ను  మ‌న‌వాళ్లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు క‌నుక ఆన్‌లైన్ గ్రాస‌రీ యాప్స్‌ను పెద్ద‌గా పట్టించుకోవడం లేదు.
5. పెద్ద పెద్ద కంపెనీల యాప్స్ లో కూడా మ‌నం అనుకున్న‌వి, మ‌న వాతావ‌ర‌ణానికి స‌రిప‌డా స‌రుకులు ఉండ‌క‌పోవ‌డం. వాటిమీద లోక‌ల్‌గా ఉన్న పెద్ద వెండ‌ర్లు ఇచ్చినంత డిస్కౌంట్లు, మార్జిన్లు ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఓ కార‌ణం. 
6. క‌స్ట‌మ‌ర్ ఫ్రెండ్లీ స‌ర్వీస్‌, డెలివరీ హ్యాండ్లింగ్‌, టైం, క్యాష్‌ను మేనేజ్ చేయ‌డం ఆన్‌లైన్‌లో పెద్ద హ‌ర్డిల్‌. దీన్ని ఓవ‌ర్‌క‌మ్ చేయాలంటే యాప్స్ త‌మ స్టాఫ్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ప్రాబ్ల‌మ్స్‌ను రెక్టిఫై చేయాలి. చాలా యాప్స్ ఈ విష‌యంలో ఫెయిల్ అవుతున్నాయి. 
7. యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ ఈజీగా  ఉండ‌డం,  షాపింగ్ చేయ‌డంలో ఈజ్‌, సేఫ్ పేమెంట్ టెక్నిక్స్‌.. ఆన్‌లైన్ బిజినెస్‌లో అత్యంత కీల‌కం. ఇందులో ఏది మిస్స‌యినా యూజ‌ర్‌ను ఆక‌ట్టుకోలేరు. చాలా గ్రాస‌రీ యాప్స్ ఈ రిక్వైర్ మెంట్స్‌ను ఫుల్ ఫిల్ చేయ‌లేక‌పోతుండ‌డంతో వీటి యూసేజ్ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉండ‌డం లేదు.  
ఈ రీజ‌న్స‌న్నీ కాలిక్యులేట్ చేసుకుని వాటికి ప‌రిష్కారాలు క‌నుక్కొంటే గానీ గ్రాస‌రీ యాప్స్ మార్కెట్లో స‌ర్వైవ్ కావ‌డం క‌ష్టం. 

 
 

జన రంజకమైన వార్తలు