• తాజా వార్తలు
  •  

20 నిముషాల రైడ్‌కు 9ల‌క్ష‌ల రూపాయ‌లు ఛార్జి చేసిన ఉబెర్  

క్యాబ్‌లు వ‌చ్చాక ఆటోల‌కు గిరాకీ త‌గ్గిపోయింది. ఎందుకంటే ఆటో ఫేర్‌కు, క్యాబ్ ఛార్జికి పెద్ద తేడా ఏమీ ఉండ‌డం లేదు. ఒక్క క్లిక్‌తో క్యాబ్ ఇంటిముందుకొచ్చి నిల‌బడుతుంది. ఏసీలో ప్ర‌యాణం.  కార్డులతో బిల్లు కట్టుకోవ‌చ్చు. క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఉండ‌నే ఉన్నాయి. అందుకే   హైద‌రాబాద్‌, ముంబ‌యి, ఢిల్లీ, బెంగ‌ళూరు లాంటి సిటీల్లో కారు కొనుక్కుని ట్రాఫిక్‌లో వెళ్ల‌డం క‌న్నా క్యాబ్ బుక్ చేసుకోవ‌డం బెట‌ర‌నుకుంటున్నారు చాలా మంది.  కానీ ఉబెర్ క్యాబ్‌లో వెళ్లినందుకు ఓ కెన‌డియ‌న్ క‌ట్టిన ఛార్జి చూస్తే గుండె గుబేలుమ‌న‌డం ఖాయం. 
ఏడున్న ర కిలోమీట‌ర్లకు 9ల‌క్ష‌ల ఫేర్‌
 కెన‌డాలోని టొరంటోలో హిష‌మ్ స‌లామా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.  5 మైళ్లు అంటే 7.5 కిలోమీట‌ర్ల దూరం. 20 నిముషాల‌లోపే ప్ర‌యాణం. గ‌మ్యం చేర‌గానే క్యాబ్ డ్రైవ‌ర్ చెప్పిన బిల్లు చూసి స‌లామా గట్టిగా న‌వ్వాడు. కానీ ఆ ఫేర్ నిజ‌మేన‌ని డ్రైవ‌ర్ చెప్ప‌డంతో షాక్‌కు గుర‌య్యాడు. ఎందుకంటే ఆ రైడ్‌కు అయిన ఫేర్ 18,518  కెన‌డియ‌న్ డాల‌ర్లు. మ‌న కరెన్సీలో చెప్పాలంటే జ‌స్ట్ 9 ల‌క్ష‌ల 361 రూపాయ‌లు.  ఇంత బిల్లా అని అడిగితే ఏమోసార్ నాకు అంతే చూపించింద‌న్నాడు క్యాబ్ డ్రైవ‌ర్‌. అనుమానం వ‌చ్చి చెక్ చేసుకుంటే స‌లామా  క్రెడిట్ కార్డ్‌లో నుంచి 9 ల‌క్ష‌ల అమౌంట్ క‌ట్ అయిపోయింది కూడా.  ఉబెర్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేస్తే మీరు చేసిన రైడ్‌కే బిల్లు వ‌చ్చింద‌ని ఆన్స‌ర్ చెప్పారు. దీంతో స‌లామా ఆ విష‌యాల‌న్నింటినీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దెబ్బ‌కు దిగొచ్చిన ఉబెర్ ఆ అమౌంట్ మొత్తాన్ని రిఫండ్ చేసింది. 
ఉబెర్‌కు త‌ల‌పోటు
ఎంప్లాయిస్ ఎలిగేష‌న్స్‌, రైడ‌ర్ల ఆందోళ‌న‌లు ఇలా 2017లో ఇప్ప‌టికే ఎన్నో త‌ల‌పోట్లు తెచ్చుకున్నెఉబెర్‌కు ఈ భారీ ఫేర్ ఇష్యూ మ‌రింత చెడ్డ‌పేరు తెచ్చిపెట్ట‌న‌ట్ల‌యింది.  ఉబెర్ ఫేర్ సిస్టం స‌రిగా ఉండ‌ద‌ని క‌స్ట‌మ‌ర్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఇది బ‌లం తీసుకొచ్చింది.  ఫేర్ కాలిక్యులేష‌న్‌లో ఎర్ర‌ర్ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని, త‌ప్పు తెలియ‌గానే అత‌నికి ఫుల్ రిఫండ్ ఇచ్చేశామ‌ని ఉబెర్ చెప్పుకొచ్చింది. అయితే అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ అయిపోయింది. 

జన రంజకమైన వార్తలు