• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో షూ కొంటున్నారా? ఐతే ఇది చ‌దవండి.. పొరపాటున కూడా కొన‌రు

ఆన్‌లైన్‌లో ఎప్పూడూ డిస్కౌంట్‌లో దొరికే వ‌స్తువుల్లో షూ కూడా ఒక‌టి లోటో, స్పార్క్‌లాంటి ఇండియ‌న్ బ్రాండ్స్ నుంచి రీబాక్‌, నైకీ, స్కెచ‌ర్స్, సూప‌ర్ డ్రై వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ వ‌ర‌కు అన్నీ 20% నుంచి 50% వ‌ర‌కు డిస్కౌంట్ల‌లో దొరుకుతాయి. పండ‌గలు, సూప‌ర్ సేల్స్ ఆఫ‌ర్ల‌లో అయితే 70% వ‌రకూ కూడా ఇస్తుంటారు. ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ వాడాల‌న్న ప్యాష‌న్ ఉన్న యూత్ వీటిని బాగా కొంటున్నారు. అయితే ఇవన్నీ నిజంగా బ్రాండెడ్ గూడ్సేనా? ఈ ప్ర‌శ్న కొనేవాళ్ల‌కు కూడా వ‌స్తుంది.కానీ అమ్మేవి పెద్ద పెద్ద ఈ కామ‌ర్స్ పోర్ట‌ళ్లు కాబ‌ట్టి ఒరిజిన‌లే అయి ఉంటుంద‌ని కొనేస్తారు. కానీ ఫ్లిప్‌కార్ట్‌లాంటి పెద్ద ఈకామ‌ర్స్ పోర్ట‌ల్ కూడా న‌కిలీ ప్రొడ‌క్ట్స్‌, పెద్ద బ్రాండ్ల‌కు కాపీ ప్రొడ‌క్ట్స్ అమ్ముతున్నాయి. ఇటీవ‌లే ఇంట‌ర్నేష‌న‌ల్ షూ బ్రాండ్ స్కెచ‌ర్స్ త‌మ ప్రొడ‌క్ట్స్‌కి న‌కిలీవి అమ్ముతుందంటూ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రిటైల్ నెట్‌, టెక్ క‌నెక్ట్‌, యూనికెమ్ లాజిస్టిక్స్‌, మార్కోవాగ‌న్ అనే మ‌రో నాలుగు సంస్థ‌ల‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. 
15వేల పెయిర్స్ ప‌ట్టుబ‌డ్డాయి
 పోలీసుల సాయంతో ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌ల్లోని ఏడు గోడౌన్స్‌లో రైడ్ చేసింది. దాదాపు 15వేల న‌కిలీ స్కెచ‌ర్స్ షూ పెయిర్స్ దొరికాయి. ఇదొక్క‌టే కాదు టామీ హిల్‌ఫిగ‌ర్‌, లాక్టోజ్, కెల్విన్ క్లైన్‌, లీవైస్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ గ‌డిచిన మూడేళ్లుగా ఇలాంటి రైడ్స్ ఎన్నో చేయించి కొన్నివేల జ‌తల న‌కిలీ షూస్‌ను ప‌ట్టిచ్చాయి.  స్కెచ‌ర్స్ యూఎస్‌లో రెండో అతిపెద్ద షూ బ్రాండ్‌. 2020 క‌ల్లా ఇండియాలో 1500 కోట్ల సేల్స్ రీచ్ కావాల‌న్న‌ది కంపెనీ టార్గెట్‌. ఇలాంటి కాపీ ప్రొడ‌క్ట్స్ అమ్మితే త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని కంపెనీ ప్ర‌శ్నిస్తోంది. 
ఫ్లిప్‌కార్ట్ ఏమంటోంది? 
సాధార‌ణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈకామ‌ర్స్ పోర్ట‌ళ్లు ఒక‌టే మాట చెబుతాయి. ప్రొడ‌క్ట్‌ను తాము తయారుచేయ‌డం లేద‌ని, తాము వాటిని అమ్మ‌డానికి ఫ్లాట్‌ఫాం మాత్ర‌మే క్రియేట్ చేస్తామంటాయి. అయితే కొనే క‌స్ట‌మ‌ర్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి సంస్థ‌ల‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే ప్రొడ‌క్ట్ కొంటారు త‌ప్ప ఆ ప్రొడ‌క్ట్ అమ్ముతున్న రిటెయిల‌ర్ లేదా డీల‌ర్ ఎవ‌ర‌న్న‌ది  ప‌ట్టించుకోరు. కాబ‌ట్టి ఇలాంటి విష‌యాల్లో ఈకామ‌ర్స్ సంస్థ‌లు క‌చ్చిత‌మైన రూల్స్ పెట్టుకుని పాటించ‌క‌పోతే క‌స్ట‌మ‌ర్లు లాస్ అవుతార‌ని, ఆ ప్రొడ‌క్ట్ బాగోలేక‌పోతే త‌మ‌కు  రిప్యుటేష‌న్ పోతుంద‌ని కంపెనీలు గోల పెడుతున్నాయి.  కస్ట‌మ‌ర్లుగా మ‌నం గుర్తించాల్సింది ఏమిటంటే ఇవ‌న్నీ ఇంటర్నేష‌న‌ల్ బ్రాండ్స్‌.. 60%, 70% డిస్కౌంట్లు ఇవ్వ‌వు. ఎప్పుడో ఏడాదికోసారి అదీ మ్యాగ్జిమం  10 -30% వ‌ర‌కూ డిస్కౌంట్ ఇస్తాయి.అలాంట‌ప్పుడు వీలైతే ఆఫ్‌లైన్ అదీ ఆ బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో కొనుక్కోవ‌డం మంచిదంటున్నారు మార్కెట్ ఎక్స్‌ప‌ర్ట్‌లు.  లేదంటే మీరు న‌కిలీ ప్రొడ‌క్ట్స్ కొనిమోస‌పోయే ప్ర‌మాద‌ముంది. అలాంటి కాపీ ప్రొడ‌క్ట్ మార్కెట్లో చాలా త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతాయి. మీరు వాటిని డ‌బుల్ రేట్‌తో కొంటున్న‌ట్లే లెక్క అని ఎక్స్‌ప‌ర్ట్‌లు ఎనాలిసిస్ చేస్తున్నారు. 

జన రంజకమైన వార్తలు