• తాజా వార్తలు

వాలెట్ కంపెనీల‌ను మెసేజింగ్ యాప్‌లు రీప్లేస్ చేయ‌బోతున్నాయా!

భార‌త్‌లో ఇప్పుడు న‌డుస్తోంది డిజిట‌ల్ కాలం. అంద‌రూ మ‌నీ ట్రాన్సాక్ష‌న్లు మాని.. డిజిట‌ల్ వైపు మ‌ళ్లాల‌ని ప్ర‌భుత్వం కూడా ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌ల‌ను గుప్పిస్తోంది. దీనిలో భాగంగా భీమ్ లాంటి యాప్‌ను కూడా రంగంలోకి తీసుకొచ్చింది. డిమోనిటైజేష‌న్ త‌ర్వాత  దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా పేటీఎం, మొబిక్‌విక్ లాంటి వాలెట్ల జోరు పెరిగింది. అయితే ఇప్పుడు మెసేజింగ్ యాప్‌లు కూడా డిజిట‌ల్ లావాదేవీల్లోకి దిగాయి. వాట్స‌ప్‌, హైక్ లాంటి పాపుల‌ర్ యాప్‌లు డిజిటల్ లావాదేవీల‌పై దృష్టిపెట్టాయి. ఈ నేప‌థ్యంలో వాలెట్ కంపెనీల‌ను మెసేజింగ్ యాప్‌లు రీప్లేస్ చేయ‌బోతున్నాయా అన్న సందేహం త‌లెత్తుతోంది.

బ‌రిలో హేమాహేమీలు
ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లకు ఆద‌రణ పెరిగిన నేప‌థ్యంలో ఈ కొత్త ట్రెండ్‌ను సొమ్ము చేసుకునేందుకు హేమాహేమీ సంస్థ‌లు బ‌రిలో దిగాయి. గూగుల్‌, వాట్స‌ప్‌, అమెజాన్‌, హైక్‌, క్వాట్రో బీపీవో లాంటి పెద్ద సంస్థ‌లు డిజిట‌ల్ లావాదేవీల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా త‌మ‌కు ఎక్కువ‌మంది వినియోగ‌దారులు ఉన్న భార‌త్‌లో మ‌రింత బ‌ల‌ప‌డేందుకు డిజిట‌ల్ పేమెంట్ మోడ్ స‌రైన ప‌ద్ధ‌త‌ని ఈ సంస్థ‌లు భావిస్తున్నాయి. ఈ ఏడాది భార‌త్‌లో 25 బిలియ‌న్ల డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు జ‌రిగాయి. యూరోపియ‌న్ పేమెంట్స్ ఫ్లాట్‌ఫాం ఆర్ ఎస్‌2ను భార‌త్‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

2020 నాటికి 500 బిలియ‌న్ డాల‌ర్లు
భార‌త్‌లో డిజిట‌ల్ పేమెంట్ ద్వారా జ‌రిగే ట్రాన్సాక్ష‌న్లు 2020 నాటికి 500 బిలియ‌న్ డాల‌ర్లు దాటే అవ‌కాశం ఉంద‌ని గూగుల్‌-బోస్ట‌న్ గ్రూప్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప‌రిశోధ‌న‌లో తేలింది. పే యూ పేమెంట్ గేట్ వే లాంటి సంస్థ‌లు కూడా డిజిట‌ల్ విప్ల‌వాన్ని తీసుకొచ్చే దిశ‌గా ముందుకు అడుగులు వేస్తున్నాయి. అయితే భార‌త్‌లో ఇప్ప‌టికే ఉన్నా పేటీఎం, మొబిక్‌విక్ లాంటి వాలెట్‌ల‌ను త్వ‌ర‌లో రీప్లేస్ చేసే విధంగా మెసేజింగ్ యాప్‌లు భారీ స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్ప‌టికే హైక్ సంస్థ 5.0 వెర్ష‌న్‌లో డిజిట‌ల్ పేమెంట్ విధానాన్ని అప్‌డేట్ చేసింది.  డిజిట‌ల్ పేమెంట్ విధానం గురించి వాట్స‌ప్ ప్ర‌క‌టించినా ఇంకా అమ‌ల్లోకి తీసుకు రాలేదు. స్పామ్‌ కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ యాప్ ట్రూ కాల‌ర్ కూడా ఇటీవ‌లే డిజిట‌ల్ పేమెంట్ మోడ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. త్వ‌ర‌లోనే గూగుల్ కూడా పేమెంట్ యాప్‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంది. ఆ పేమెంట్ మోడ్‌కి పేరు హిందీలో పెట్ట‌నుండ‌డం విశేషం. 


 

జన రంజకమైన వార్తలు