• తాజా వార్తలు
  •  

షియోమి రిప‌బ్లిక్ డే సేల్ అన్ని వివ‌రాలు మీకోసం ఒకే చోట‌!

రాబోతోంది రిప‌బ్లిక్ డే. దీని కోసం ఫోన్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున సిద్ధ‌మ‌వుతున్నాయి. కొత్త‌గా మార్కెట్లోకి దిగుతున్న కంపెనీల‌తో పాటు..ఇప్ప‌టికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌తో వినియోగ‌దారులను ఎలా  ఆక‌ట్టుకోవాలా అనే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. దీనిలో భాగంగా షియోమి కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేసింది. రిప‌బ్లిక్ డే రోజు వీలైనంత ఎక్కువ ఫోన్లు అమ్మాల‌నే ల‌క్ష్యంతో పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్ వేదిక‌గా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి జియోమి ప్ర‌క‌టించిన ఆఫ‌ర్లు, వాటి వివ‌రాలేంటో చూద్దామా...

మొబిక్‌విక్‌తో రూ.4 వేల క్యాష్‌బాక్‌
జ‌న‌వ‌రి 24 నుంచి 26 వ‌ర‌కు రిప‌బ్లిక్ డే సేల్ నిర్వ‌హించాల‌ని షియోమి నిర్ణయించింది. ప‌రిమిత కాల వ్య‌వ‌ధిలో ఎక్కువ ఫోన్లు అమ్మాల‌నేది ఆ సంస్థ వ్యూహం. ఈ సేల్‌లో భాగంగా ఎంఐ ఏ1, ఎంఐ మిక్స్ 2, రెడ్‌మిడ్ 5ఏ, రెడ్ మి నోట్ 4, ఎంఐ మ్యాక్స్ 2, రెడ్ మి 4 మోడ‌ల్స్‌ను అమ్మ‌కానికి పెట్టాల‌ని షియోమి భావిస్తోంది. మొబిక్‌విక్ వ్యాలెట్ ద్వారా ఈ మొబైల్ కొనుగోళ్లు చేస్తే 30 శాతం ఫ్లాట్  డిస్కౌంట్ ల‌భిస్తుంది. అంటే దాదాపు రూ.4 వేలు  సూప‌ర్ క్యాష్ రూపంలో మీ వ్యాలెట్‌లోకి రానున్నాయి. ఇదే కాక జియోమి ఫోన్ల‌ను కొనుగోలు చేసిన‌వాళ్ల‌కు అద‌నంగా హంగామా మ్యూజిక్ ఉచితంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భించ‌నుంది. 

కూప‌న్లు కూడా..
సేల్ నడుస్తున్న తేదీల్లో యూజ‌ర్లు ప్ర‌తి రోజు ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత ఎంఐ అకౌంట్లో లాగిన్ అయితే రూ.50, రూ.100, రూ.200, రూ.500 గిఫ్ట్ కూప‌న్లు పొందొచ్చు. ఈ కూప్ల‌ను మీరు ఇత‌ర యాక్స‌స‌రీస్ కొన‌డానికి వాడుకోవ‌చ్చు. అయితే ఈ కూప‌న్ల‌ను రిడీమ్ చేసుకోవ‌డానికి మినిమం ట్రాన్సాక్ష‌న్ అమౌంట్ రూ.50 అయి ఉండాలి. షియోమి ఎంఐ ఏ1 కొంటే ఫ్లాట్ రూ.1000 డిస్కౌంట్ ల‌భిస్తుంది. అంటే రూ.13999కే ఇది మ‌న‌కు సేల్ పిరియ‌డ్‌లో ల‌భ్యం అవుతుంది. దీని అస‌లు ధ‌ర రూ.14,999గా ఉంది.

కేసులు, కవర్లు కూడా..

ఎంఐ మిక్స్ 2 కూడా రూ.32,999కు ల‌భిస్తుంది. దీని అస‌లు ధ‌ర రూ.35.999గా ఉంది. షియోమి ఎంఐ మ్యాక్స్ 2, రెడ్‌మి నోట్ 4 కూడా త‌మ ధ‌ర‌ల‌పై క‌నీసం రూ.1000 డిస్కౌంట్‌కు ల‌భించ‌నున్నాయి. జ‌న‌వ‌రి 25 మ‌ధ్యాహ్నం మొద‌లయ్యే సేల్‌లో రెడ్‌మి 4 రూ.6999కి దొర‌క‌నుండ‌గా.. రెడ్‌మి 5ఏ రూ.4999కు మీరు కొనుగోలు చేయ‌చ్చు షియోమి కేసులు, క‌వ‌ర్లు కూడా రూ.200 తక్కువ‌గా అమ్మ‌నున్నారు. ఎంఐ ప‌వ‌ర్ బ్యాంకులు కూడా రూ.799 నుంచి ల‌భించ‌నున్నాయి.                                                                                         

జన రంజకమైన వార్తలు