• తాజా వార్తలు
  •  

ఉబ‌ర్ ఆల్వేస్ ఆన్ వివాదాన్ని ఐఓఎస్ 11 ఎలా సాల్వ్ చేస్తుందో తెలుసా?

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే కార్ స‌ర్వీసుల్లో ఉబ‌ర్‌ది అగ్ర‌స్థానం. దీనిలో సేవ‌లు ప‌క్కాగా ఉంటాయ‌ని వినియోగ‌దారులు న‌మ్ముతారు. కానీ గ‌త సంవ‌త్స‌రం ఉబ‌ర్ చేసిన ఒక ప‌నితో క‌స్ట‌మ‌ర్ల‌లో అనుమానాలు ఎక్కువ‌య్యాయి. ఈ సంస్థ‌పై న‌మ్మ‌కం స‌డ‌లింది. అదే వైల్ యూజింగ్ ది యాప్‌ను తొల‌గించ‌డ‌మే దీనికి కార‌ణం. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ కారు ఎక్కి దిగిన త‌ర్వాత కూడా అత‌ణ్ని ట్రాక్ చేసే అవ‌కాశం ఉబ‌ర్‌కు ఉంది. దీంతో ఉబ‌ర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో యాపిల్ ఐఓఎస్ 11లో ఉబ‌ర్ ఈ పాత ఆప్ష‌న్‌ను మ‌ళ్లీ అప్‌డేట్ చేసింది.

పాత ఐఓఎస్‌ల‌కు కూడా..
ఈ వారంలోనే విడుద‌లైన ఐఓఎస్ 11 వెర్ష‌న్ ఫోన్‌లో నో లాంగ‌ర్ అలోస్ యాప్స్ టు హైడ్ ద వైల్ యూజింగ్  ద యాప్ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీని వల్ల త‌మ అనుమ‌తి లేకుండా ఎవ‌రూ త‌మ గురించి ట్రాక్ చేయ‌కుండా యూజ‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డొచ్చు. వాళ్లు రైడింగ్ చేసి దిగిపోయిన త‌ర్వాత ఆల్వేస్ ఆన్ ట్రాకింగ్‌లో మార్పు చేర్పులు చేసుకునే అవ‌కాశం ఉంది. కొత్త‌గా వ‌చ్చిన అప్‌డేట్ వ‌ల్ల ఐఓఎస్ 10,  ఐఓఎస్ యూజ‌ర్లు కూడా ఈ వైల్ యూజింగ్ ద యాప్ ఆప్ష‌న్‌ను వాడుకోవ‌చ్చు. దీని  కోసం వాళ్లు సెట్టింగ్స్‌లో ప్రైవ‌సీ... లొకేష‌న్ స‌ర్వీసెస్‌.. ఉబ‌ర్ ఆప్ష‌న్‌ను వెళ్లి చెక్ చేసుకోవాలి. 

క‌స్ట‌మ‌ర్లు సేఫ్
ఐఓఎస్‌లో వ‌చ్చిన తాజా మార్పుల వ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం దొరికింది. లేక‌పోతే వారు త‌మ‌ను ట్రాక్ చేస్తున్నార‌న్న భావ‌న‌లోనే ఉండేవాళ్లు. చాలామంది ఈ విష‌యంపై ఉబ‌ర్‌కు కంప్లైంట్ చేశారు. త‌మ ప్రైవసీకి ట్రాకింగ్‌ భంగం క‌లిగిస్తుంద‌ని.. దాడులు చేయ‌డానికి, ఇత‌ర నేరాలు చేయ‌డానికి ఈ ట్రాకింగ్ పురికొల్పేవిధంగా ఉంద‌ని క‌స్ట‌మ‌ర్లు ఒక ద‌శ‌లో ఆందోళ‌న చెందారు. ఐతే తాజా అప్‌డేట్ వ‌ల్ల ఉబ‌ర్ మ‌ళ్లీ క‌స్ట‌మ‌ర్ల‌లో న‌మ్మ‌కాన్ని బ‌ల‌ప‌రుచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. 

జన రంజకమైన వార్తలు