• తాజా వార్తలు
  •  

సడన్ గా గూగుల్ తేజ్ యాప్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ లు మాత్రమేనా ?

గూగుల్ ఇండియా లో ప్రవేశపెట్టిన UPI ఇంటర్ ఫేస్ తో కూడిన పేమెంట్ యాప్ అయిన  తేజ్ యాప్ సంచలనాలు సృష్టిస్తుంది. గత సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఈ యాప్ మూడు నెలలు కూడా తిరగకముందే 12 మిలియన్ ల యూజర్ లనూ, 140 మిలియన్ ల ట్రాన్సక్షన్ లను సంపాదించింది. ప్రభుత్వ ఆధారిత యాప్ అయిన భీం యాప్ కూడా ఇలాగే లాంచ్ అయిన 10 రోజులకే 10 మిలియన్ ల యూజర్ లను సంపాదించగలిగింది కానీ ట్రాన్సక్షన్ ల విషయం లో మాత్రం తేజ్ యాప్ కంటే వెనుకంజ లోనే ఉందంటే దీని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీం యాప్ 12 నెలల కాలంలో కేవలం 62 మిలియన్ లు మరియు డిసెంబర్ నెలలో 9 మిలియన్ లు మాత్రమే ట్రాన్సక్షన్ లు చేయగలిగింది. ఈ రెండు యాప్ లకూ యూజర్ ల సంఖ్య లో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ ట్రాన్సక్షన్ ల విషయం లో అంత తేడా ఎందుకుంది? ఇది భీమ్ వైఫల్యమా? లేక తేజ్ విజయమా? గూగుల్ తేజ్ ఈ UPI రంగంలో ఒక గేమ్ చేంజర్ లా పనిచేస్తుందా?

తేజ్ ఇంత విజయవంతం అవడానికి కారణాలేమిటి?

ఈ యాప్ లాంచ్ చేసేటపుడు ఒక గేమ్ చేంజర్ కి ఉండవలసిన సామర్థ్యాలు అన్నీ దీనికి ఉన్నాయనీ, UPI రంగం లో తన శక్తి మేరకు ఇది కొంత విద్వంసాన్ని సృష్టించగలదనీ నిపుణులు అంచనా వేశారు. మాతృసంస్థ అయిన గూగుల్ మాత్రం ఈ క్రెడిట్ అంతా ఈ యాప్ కు ఉన్న సింప్లిసిటీ దే అని చెప్తుంది. సాధారణంగా యూజర్ లు సింపుల్ గా, సురక్షం గా ఉపయోగించడానికి సులువుగా ఉండే నమ్మకమైన యాప్ లను మాత్రమే ఎంచుకుంటారు. ఈ లక్షణాలన్నీ తేజ్ లో పుష్కలంగా ఉండడం వలన ఇది ఇంతగా విజయవంతం అయింది అని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి.

మరి క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ ల మాటేమిటి?

అయితే తేజ్ కు పెరుగుతున్న విశేష ఆదరణకు సంబంధించి మరొక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అదే ఈ యాప్ అందించే క్యాష్ బ్యాక్ లు మరియు రివార్డ్ లకు సంబంధించి. ఈ యాప్ వినియోగదారులకు ఆకర్షణీయమైన రీతిలో క్యాష్ బ్యాక్ లు మరియు రివార్డ్ లు ప్రకటించడం వలననే ఇది ఇంతగా ఆదరణ పొందిందనే సమాచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం లేకపోలేదు.  దీనియొక్క క్యాష్ బ్యాక్ పాలసీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ యాప్ ను ఉపయోగించి మీరు ఏదైనా ట్రాన్సక్షన్ చేస్తే తిరిగి మీకు కొంత మొత్తం లభించే అవకాశం ఉంది. తేజ్ వీటినే స్క్రాచ్ కార్డు లు అంటుంది. ఈ వర్చ్యువల్ టోకెన్ లను మనం లాటరీ కార్డ్ ల లాగా చెక్ చేసుకుని ప్రతీ కార్డు కు కొంత మొత్తాన్ని పొందవచ్చు. దీనిలో ఉండే ప్రతికూలత ఏమిటంటే మనం ఎన్ని ట్రాన్సక్షన్ లు చేసినా సరే కొన్నిసార్లు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనికి సంబందించిన గూగుల్ ప్లే రివ్యూ లను మనం గమనించవచ్చు. ఈ యాప్ కు తేజ్ అనే పేరు కంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పేరు ఇస్తే బాగుంటుందేమో అని ఒకతను రివ్యూ ఇచ్చాడు. గమ్మత్తు ఏమిటంటే అతను దీనికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అంటే దీని ప్రదర్శన ఆశించిన స్థాయిలోనే ఉందనేగా?

అయితే కొత్తగా దీనికి యూజర్ లుగా మారుతున్న వారిలో మెజారిటీ శాతం మంది మాత్రం ఇది అందిస్తున్న క్యాష్ బ్యాక్ లు మరియు రివార్డ్ ల కోసమేనని చెబుతున్నారు. ఈ విషయం లో అనేక మందిని సర్వే చేయగా వారు ఈ యాప్ ద్వారా చాలా క్యాష్ బ్యాక్ లు పొందమనీ , కేవలం ట్రాన్సక్షన్ ల ద్వారా మాత్రమే గాక ఫ్రెండ్స్ ను రిఫర్ చేసినా గానీ ఇందులో రివార్డ్ లు లభిస్తున్నాయనీ చెబుతున్నారు. ఢిల్లీ కి చెందిన ఒక యువకుడిని దీని గురించి అడుగగా అతను స్థిరంగా స్నేహితులను, కుటుంభ సభ్యులనూ ఈ మోడ్ లోనికి మారుస్తున్నానీ ఎందుకంటే తన రిఫరల్ కోడ్ ద్వారా ఎవరైనా రూ 50/- లు ఖర్చు చేస్తే తిరిగి ఇతనికి రూ 50/- లు వస్తుంది అనీ చెబుతున్నాడు. అది ఉచిత మనీ నే కదా! అయితే స్క్రాచ్ కార్డు ల గురించి అడిగితే మాత్రం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెబుతున్నాడు. అయితే స్క్రాచ్ కార్డు లపై కూడా అతనికి ఒకసారి రూ 150/- లు వచ్చాయంట! మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇండియా లో అతిపెద్ద వాలెట్ అయిన పేటిఎం యూజర్ లు కూడా మెల్లగా ఇప్పుడిప్పుడే తేజ్ కు మారుతున్నారు.

ముగింపు : పై విషయాలన్నీ గమనిస్తే గూగుల్ తేజ్ ఇంతగా ఆదరణ పొందడానికి కారణం అది ఇస్తున్న రివార్డ్ లు మరియు క్యాష్ బ్యాక్ లే కావచ్చు కానీ ఈ యాప్ ను వాడడం లో ఉన్న సౌలభ్యత, దీనియొక్క సింప్లిసిటీ మరియు భద్రతకూడా ప్రధాన భూమిక ను పోషిస్తున్నయనడం లో సందేహం లేదు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు