• తాజా వార్తలు
  •  

R.G.U.K.T ఇడుపుల పాయ

దవ తరగతి పూర్తైన వెంటనే ప్రతి విద్యార్ధి మనసులో మెదిలే ఒకే ఒక ప్రశ్న “నేను ఏ కాలేజీలో చేరాలి?” అంతేగాక మన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ యొక్క ప్రధాన లక్ష్యం కూడా అదే కదా! కాబోయే ఇంజినీర్ లకు వివిధ రకాల మార్గాలను అందించడమే మన సైట్ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని గ్రామీణ యువత యొక్క కలల సౌధం అయిన ఇడుపుల పాయ నందలి APIIIT, RGUKT గురించి సమగ్ర సమాచారాన్ని ఈ వ్యాసంలో ఇవ్వబోతున్నాము .

ఒక విశాలమైన తరగతి గదిలో అత్యున్నత స్థాయి సౌకర్యాలైన కంప్యూటర్, ప్రొజెక్టర్, స్పీకర్లు, వివరణాత్మక వైట్ బోర్డు, సెంట్రలైజడ్ AC, LAN..... మొదలైనవి, ఉంటే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించు కొండి. అలాంటి  తరగతి గదిలో అత్యంత నాణ్య మైన విద్యను జతచేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. అదే IIIT.

అలాంటి విద్యా వ్యవస్థ లో భాగమవడం ప్రతి విద్యార్ధి యొక్క కలగా ఉంటుంది కదా! కానీ ఈ కల చాలా మంది టాలెంట్ కలిగి, ఆర్థికంగా వెనుక బడిన గ్రామీణ యువతకు 2008 వ సంవత్సరం వరకూ తీరని కల గానే మిగిలి  పోయింది. 2008 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ క్రింద  ౩ విద్యాసంస్థలను ప్రారంబించింది. అవే ట్రిపుల్ ఐటిలు. అవి RGUKT BASARA, RGUKT NUJIVEED, RGUKT RK VALLEY KADAPA. ఇవి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను గ్రామీణ యువతకు అందించడంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.

చేస్తూ నేర్చుకోవడం అనే సూత్రం మీద ఆధారపడి ఇక్కడి విద్యా వ్యవస్థ ఉంటుంది. సమస్యల సాధనలో ఈ సూత్రం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడి కోర్సు మొత్తం ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది.మొదటి రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సు గా పరిగణిస్తారు.ఇది మన ఇంటర్మీడియట్ కు సమానంగా ఉంటుంది. మిగిలిన నాలుగు సంవత్సరాలు B.Tech కోర్సు గా ఉంటుంది. విద్యార్థులు తమ పదవ తరగతి పూర్తైన వెంటనే దీనిలో చేరి ఇంజినీరింగ్ డిగ్రీ ని తీసుకుని పట్టబద్రులుగా బయటకు వస్తారు. ప్రతి విద్యార్ధి కి కోర్సు ప్రారంభం లోనే ఒక లాప్ టాప్ ఇవ్వబడుతుంది. పాఠాలు చాల వరకు ఆన్ లైన్ విధానంలో జరుగుతాయి. ఇక్కడి పాఠ్య ప్రణాళిక అంతా ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటుంది.అది ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా ఉంటుంది. ఈ విధానంలో విద్యార్థులు ఒక పూర్తీ స్థాయి ఇంటిని పోలిన వాతావరణంలో శిక్షణ పొందుతారు.

ఇలాంటి ఆహ్లాదకరమైన, అద్భుతమైన, కాంపస్ లో నా అనుభవాలు నాకు ఎదురైన సంఘటనలను టి వ్యాసంలో చర్చించడం జరిగింది....

వలసయ్య గారి వసుధ C.V.R, R.G.U.K.T,

IDUPULAPAYA

 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు