• తాజా వార్తలు
  •  

ప్లేస్ మెంట్ ల కాలేజ్ మా P.V.P సిద్దార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

నేడు రాష్ట్రం లోని టాప్ టెన్ కళాశాలల్లో ఒకటి మా పివిపి సిద్దార్థ .నవ్యాంధ్ర రాజధాని అయిన విజయవాడ నందలి పెనమలూరు లో ఉన్నది మా కాలేజ్.మాది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కాలేజ్(అటానమస్).దీనినే స్వయం పా లన కలిగిన సంస్థ అని కూడా అంటారు.అంతకు ముందు JNTU ఆధ్వర్యంలో ఉన్న మా కాలేజ్ నాలుగు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో మా క్యాంపస్ ఉంటుంది.మా విద్యార్థులం అందరమూ చాలా స్నేహ పూర్వకంగా ఉంటాము.

ఇంజనీరింగ్ విద్యార్థులకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలైన ల్యాబ్ లను అందించడం లో మా యాజమాన్యం మాకు ఎప్పుడూ తోడ్పాటు గా ఉంటుంది.మంచి పరికరాలతో కూడిన జిమ్ కూడా మా కాలేజ్ లో ఉన్నది.ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆసక్తి కలిగిన వారిని గేమ్స్ లో బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు.లెక్చరర్ లు అందరూ మాతో చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు.అన్నింటికీ మించి సెంట్రల్ లైబ్రరీ మా కాలేజ్ కే పెద్ద హైలెట్.మా లైబ్రరీ లో మాకు అవసరమైన అన్ని పుస్తకాలూ ఉంటాయి.అక్కడ మాకు దొరకని పుస్తకం ఉండదంటే అతిశయోక్తి కాదు.హై స్పీడ్ ఇంటర్ నెట్ తో కూడిన కంప్యుటర్ ల్యాబ్ అందుబాటులో ఉంటుంది.

ఇక ప్లేస్ మెంట్ ల విషయానికొస్తే ప్రతి సంవత్సరం ప్రముఖ కంపెనీ లన్నీ మా కాలేజ్ లో క్యాంపస్ ఇంటర్ వ్యూ లను నిర్వహిస్తాయి.ప్రతి  ఏట  సుమారు 200 మందికి పైగా ప్లేస్ మెంట్ లలో సెలెక్ట్ అవుతూ మంచి వేతనం తో కూడిన ఉద్యోగాలలో స్థిర పడుతూ ఉంటారు.

...వల్లభాపురం హరీష్ బాబు C.V.R
                                                                                          P.V.P.S.I.T,VIJAYAWADA

 

విజ్ఞానం బార్ విశేషాలు