• తాజా వార్తలు
  •  

ఎఫ్‌బీ కి మీ గురించి ఏమేం తెలుసో బ‌య‌ట‌పెట్టే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌

మీ గురించి ఫేస్‌బుక్‌కు ఏం తెలుసు? ప‌్ర‌శ్న కొత్త‌గా ఉందా? అయినా వాస్త‌వానికి ఇది నిజం. ఫేస్‌బుక్‌కు మ‌న గురించి చాలా తెలుసు. ఎలా అంటారా.. మీరు ఏం పేజీలు లైక్ చేశారో.. ఎంతమంది స్నేహితుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారో.. చివ‌రికి మీ స్టేట‌స్‌లో ఎన్ని మాట‌లు అప్‌డేట్స్ చేశారో కూడా ఎఫ్‌బీకి తెలుసు. ఈ స‌మాచారాన్నంత‌టిని అన‌లైజ్ చేసి.. ఒక డిటైల్డ్ ప్రొఫైల్‌గా చేసి మీరెంటో చెప్పేగల‌దు ఎఫ్‌బీ. అంతేకాదు మీ గురించి ప్ర‌తి విష‌యం ఎఫ్‌బీకి తెలుసు. మీ హాబీలు, ఆస‌క్తులు అన్ని వివ‌రాలు ఎఫ్‌బీ గుప్పిట్లో ఉంటాయి. ఫేస్‌బుక్ మాత్ర‌మే కాదు ట్విట‌ర్‌, గూగుల్ కూడా మ‌న స‌మాచారాన్ని ద‌గ్గ‌ర పెట్ట‌కుంటున్నాయి.

ఎలా ట్రాక్ చేస్తాయి?
కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే మ‌నం ఎక్కువ‌గా బ్రౌజ్ చేసేది ఫేస్‌బుక్‌నే. ఇక ఈ స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. మ‌రో అడుగు ముందుకేసి ట్విట‌ర్‌లో ట్వీట్స్ చేస్తాం. మీరు ట్వీట్ చేసినా, లేక గూగుల్ ప్ల‌స్‌లో షేర్ చేసినా ఆ కుకీస్ మీ కంప్యూట‌ర్‌లో స్టోర్ అవుతాయి. దీంతో ఎఫ్‌బీ, ట్విట‌ర్‌ల‌కు మ‌న స‌మాచారం ఎక్క‌డ ఉందో.. ఏం షేర్ చేశామో తెలిసిపోతుంది. కుకీస్‌లో ఉండే స‌మాచారాన్ని ట్రాక్ చేసి ఇవి భ‌ద్రం చేసే అవ‌కాశాలున్నాయి. చాలామంది ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌ల‌ను వాడిన త‌ర్వాత సైన్ ఔట్ చేయ‌కుండా అలాగే వ‌దిలేస్తారు. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మ‌న యాక్టివిటీస్ మీద థ‌ర్డ్ పార్టీ క‌న్ను ప‌డే అవ‌కాశాలుంటాయి.

డేటా సెల్ఫీతో తెలుసుకోవ‌చ్చు
మ‌న స‌మాచారాన్ని ఎఫ్‌బీ, ట్విట‌ర్ లాంటి సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు ట్రేస్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఒక అప్లికేష‌న్ ఉంది. అదే డేటా సెల్ఫీ. ఇదో ఓపెన్ సోర్స్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌. న్యూయార్క్‌కు చెందిన క్రియేటివ్ స్టూడియో డేటా ఎక్స్ దీన్ని లాంచ్ చేసింది. మీరు ఎఫ్‌బీ ఉప‌యోగిస్తున్నప్పుడు మీ స‌మాచారం ఏమైనా ట్రేస్ అవుతుందా అనేది డేటా సెల్ఫీ ప‌సిగ‌డుతుంది. అయితే ఎఫ్‌బీలో అన్ని ట్రాక్ అవుతాయ‌ని అనుకోవ‌డానికి వీల్లేదు. త‌మ‌కు అవ‌స‌ర‌మైన పోస్టులు మాత్ర‌మే ఎఫ్‌బీ ట్రాక్ చేసే అవ‌కాశం ఉంది. డేటా సెల్ఫీని వాడ‌డం వ‌ల్ల మ‌న కీల‌క‌మైన డేటా మ‌న‌కు తెలియ‌కుండా ఎక్క‌డా సేవ్ కాకుండా ఉంటుంది. అయితే ఎంత మొత్తం డేటాను ఎఫ్‌బీ ట్రాక్ చేసేందో వివ‌రాలు పూర్తిగా ఇవ్వ‌కపోయినా ర‌ఫ్‌గా కొంత డేటాను ఇది మ‌న‌కు అందిస్తుంది.

ఎలా ప‌ని చేస్తుందంటే..
డేటా సెల్ఫీ టూల్ మ‌నకు ఫేస్‌బుక్‌కు మ‌ధ్య ఒక అనుసంధాన క‌ర్త‌గా ప‌ని చేస్తుంది. ప్ర‌పంచంలోనే ఉత్త‌మ‌మైన ఏఐ విధానంతో రూపొందిన ఈ టూల్‌ను మ‌న డౌన్‌లోడ్ చేసుకుని మ‌న సిస్ట‌మ్ లేదా ఫోన్‌లో పెట్ట‌కుంటే చాలు. మ‌న ప్ర‌తి ఫేస్‌బుక్ ఇంట‌రాక్ష‌న్‌ను ఇది మానిట‌ర్ చేస్తుంది. మీరు ఎన్ని లైక్‌లు కొట్టారు, ఒక పోస్టుకు ఎంత స‌మ‌యాన్ని వెచ్చించారు. ఏం ఇన్ఫ‌ర్మేష‌న్ షేర్ చేశారు లాంటి వివ‌రాలు స్ప‌ష్టంగా మీకు అందిస్తుంది. దీనికో ప్ర‌త్యేక‌మైన డాష్ బోర్డ్ ఉంటుంది. దీనిలో మ‌న ఎఫ్‌బీ యాక్టివిటీ మొత్తం తెలిసిపోతుంది. మ‌న డేటా ఏమైనా దారి త‌ప్పితే ఇది వెంట‌నే అలెర్ట్ చేస్తుంది. డేటా సెల్ఫీ మీ కంప్యూట‌ర్‌లో డేటాను మాత్ర‌మే స్టోర్ చేస్తుంది. ఎక్స‌ట్ర‌న‌ల్ స‌ర్వ‌ర్స్‌లో కాదు.

జన రంజకమైన వార్తలు