• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ కొత్త ఫీచ‌ర్‌తో స్నేహితుల‌తో లైవ్ చాట్ చేసుకోండిలా

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చాయంటే యూజ‌ర్ల‌కు పండ‌గే. ఎందుకంటే ఎఫ్‌బీ ఎప్పుడెప్పుడు కొత్త ఫీచ‌ర్లు అందిస్తుందోన‌ని వేచి చూసేవాళ్లు కోకొల్లలు. పొద్ద‌స్త‌మానం ఎఫ్‌బీలో ఉండేవారికి కొత్త ఫీచ‌ర్లు రిఫ్ర‌షింగ్ అనే చెప్పాలి. అందుకే ఏమైనా అప్‌డేట్స్ అయితే వాటిని వెంట‌నే త‌మ స్నేహితుల‌తో షేర్ చేసుకువాల‌ని అంతా ఉవ్విళ్లూరుతారు. తాజాగా అలాంటి అప్‌డేటే ఒక‌టి ఫేస్‌బుక్ తీసుకొచ్చింది. అదే లైవ్ చాట్ విత్ ఫ్రెండ్స్ మ‌రియు లైవ్ విత్ ఫీచ‌ర్లు. ఈ కొత్త ఫీచ‌ర్లు యువ‌త‌కు ఎక్క‌డాలేని ఆస‌క్తిని రేపుతున్నాయి.

మొబైల్‌లో టెస్టింగ్‌
లైవ్ చాట్ విత్ ఫ్రెండ్స్‌, లైవ్ విత్ ఫీచ‌ర్ల‌ను మొబైల్‌లో టెస్టు చేయాల‌ని ఫేస్‌బుక్ నిర్ణ‌యించింది. ఈ వేస‌విలో ఆఖ‌రి క‌ల్లా లైవ్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఆప్ష‌న్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌నేది ఎఫ్‌బీ ఆలోచ‌న‌. లైవ్ విత్ ఫీచ‌ర్‌ను సెల‌బ్రిటీల కోస‌మే తీసుకురావాల‌ని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఫేస్‌బుక్‌లో ప్ర‌స్తుతం ఉన్న స్టోరీస్ ఫీచ‌ర్ మాదిరిగానే ఈ రెండు కొత్త ఫీచ‌ర్లు కూడా విజ‌య‌వంతం కావాల‌ని ఎఫ్‌బీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఫేస్‌బుక్ అందిస్తున్న లైవ్ వీడియోను మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని కూడా ఆ సంస్థ భావిస్తోంది. ఈ లైవ్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఫీచ‌ర్‌తో మీ స్నేహితుల‌తో నేరుగా లైవ్‌లో మాట్లాడి, చాట్ చేసే అవ‌కాశం ఉంటుంది.

పొట్రాయిట్‌, ల్యాండ్‌స్కేప్‌
లైవ్ విత్ ఫీచ‌ర్ కూడా ఆస‌క్తిని క‌లిగించేదే. ఈ ఫీచ‌ర్‌తో మీ స్నేహితుల‌ను ఇన్‌వైట్ చేసి లైవ్ వీడియోల ద్వారా చాట్ చేసుకునే అవ‌కాశం ఉంది. యూజ‌ర్లు లాండ్‌స్కేప్‌, పొట్రాయిట్ రెండు ఫీచ‌ర్ల‌తో మీరు లైవ్ చాట్ విత్ ఆప్ష‌న్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఆప్ష‌న్ ఉప‌యోగించాలంటే యూజ‌ర్లు లైవ్ వీవ‌ర్స్ సెక్ష‌న్ నుంచి యూజ‌ర్లు ఒక గెస్ట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేక‌పోతే మీరు ఎవ‌రితో మాట్లాడాల‌ని భావిస్తున్నారో వారి కామెంట్ మీద ట్యాప్ చేస్తే చాలు. అయితే గెస్ట్‌కు ఈ లైవ్ చాట్‌లో జాయిన్ అవ్వాలో లేదా రిజెక్ట్ చేయాలో ఈ రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. రిమోట్ లొకేష‌న్స్‌లో ఉన్న వారితో ముఖాముఖిల‌ను నిర్వ‌హించ‌డానికి లైవ్ విత్ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందుగా ఈ ఫీచ‌ర్‌ను ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ కోసం అందించి.. ఆ త‌ర్వాత యూజ‌ర్లంద‌రికి అందుబాటులోకి తీసుకురావాల‌నేది ఎఫ్‌బీ ప్ర‌య‌త్నం.

జన రంజకమైన వార్తలు