• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్స్ కు కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది..

ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ క్రియేట్ చేసే అడ్మిన్ల కోసం కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. మీ గ్రూప్‌లో కొత్త‌గా ఎవ‌రైనా మెంబ‌ర్‌గా చేరాల‌నుకుంటే ఆ వ్య‌క్తిని చేర్చుకోవాలో లేదో మీదే ఛాయిస్‌. సెలెక్ట్ చేసుకునేందుకు వాళ్ల‌కు ప్ర‌శ్న‌లు వేసి మీ గ్రూప్‌కు స‌రిపోతార‌నుకుంటేనే మెంబ‌ర్‌గా జాయిన్ చేసుకోవ‌చ్చు. ఈ క్విజ్ ఫీచ‌ర్‌ను అడ్మిన్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెట్టింది.
ఆ ఇబ్బందులు తీరిన‌ట్టే
ఫేస్‌బుక్‌లో మీరు ఏదో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఏదో ఆర్ట్‌, మ్యూజిక్‌,సినీ హీరో ఫ్యాన్స్‌, లేదా పొలిటిక‌ల్ పార్టీ ఫీలింగ్‌.. ఇలా ఏదో గ్రూప్‌.. దీనిలో జాయిన్ అవ‌డానికి ఎవ‌రో ప‌ర్స‌న్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ వ్య‌క్తి ఎలాంటివారో తెలియ‌దు. తెలుసుకోవాలంటే అత‌ని రిక్వెస్ట్‌ను మీరు యాక్సెప్ట్ చేయాల్సి వ‌స్తుంది. తీరా చేశాక ఆ ప‌ర్స‌న్ మీ గ్రూప్‌కు స‌రిప‌డ‌ని వ్య‌క్తి అయితే..మీరు అభిమానించే హీరో, పొలిటీషియ‌న్‌ను ట్రాల్ చేస్తుంటే ఇబ్బంది ప‌డుతుంటారు. ఇలాంటివి చాలామంది అడ్మిన్స్‌కు అనుభ‌వ‌మే. కొత్త ఫీచ‌ర్‌తో అడ్మిన్ల‌కు ఈ బాధ‌లు త‌ప్పిన‌ట్టే.
మూడు ప్రశ్న‌లు
ఎవ‌రైనా మీ ఫేస్‌బుక్ గ్రూప్‌లో జాయిన్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయ‌గానే మీ గ్రూప్ గురించి అత‌నికి మూడు ప్ర‌శ్న‌ల‌తో ఒక లింక్ వెళుతుంది. దానికి అవ‌త‌లి ప‌ర్స‌న్ ఆన్స‌ర్ ఇవ్వాలి. ఈ ఆన్స‌ర్ గ్రూప్‌లో పోస్ట్‌కాదు. నేరుగా అడ్మిన్ వాల్‌మీద మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఆ ఆన్స‌ర్లు చూసి ఆ ప‌ర్స‌న్ మీ గ్రూప్‌లో స‌రిపోతార‌నుకుంటే యాడ్ చేసుకోవ‌చ్చు. అడ్మిన్ రివ్యూ చేసేవ‌ర‌కు ఆ వ్య‌క్తి కావాలంటే త‌న ఆన్స‌ర్‌ను చేంజ్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు