• తాజా వార్తలు
  •  

ఫేస్ బుక్ యాప్ సాయంతో పబ్లిక్ వైఫై ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? 

బ‌య‌ట ఎక్క‌డో ఉన్నారు. మొబైల్‌లో డేటా లేదు..  లేదా వైఫై ఉంటేనే గానీ యాక్సెస్ చేయ‌లేని టాస్క్. అలాంట‌ప్ప‌డు  ద‌గ్గ‌ర‌లో వైఫై ఉంటే బాగుండేది అనిపిస్తుంది క‌దా. అలాంటి అవ‌స‌రాల‌ను ఫేస్‌బుక్ గుర్తించింది.   ఫైండ్ వైఫై  (Find WiFi)  పేరుతో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.    ఈ ఫీచ‌ర్ ద్వారా మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి చూపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ లను వాడుతున్న యూజర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్  అందుబాటులోకి రానుంది.  


ఎలా వాడాలి?
* మీ  డివైస్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయాలి.  
* టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న మెనూ బ‌టన్‌ను టాప్ చేయాలి. 
* స్క్రోల్ డౌన్ చేసి   Apps section లోకి వెళ్లాలి.  See Allను టాప్ చేసి  లిస్ట్ లో నుంచి  Find Wi-Fi  అనే ఆప్ష‌న్‌ను టాప్ చేయాలి.  
*   Find Wi-Fi ఫీచ‌ర్‌ను మొద‌టిసారి ఉప‌యోగిస్తుంటే మీ లొకేష‌న్ యాక్సెస్ చేయ‌డానికి పర్మిష‌న్ ఇవ్వాలి. లేక‌పోతే ఈ ఫీచ‌ర్‌ను మీరు యూజ్  చేయ‌లేరు.
*   Find Wi-Fi ఆప్ష‌న్ క్లిక్ చేశాక మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై హాట్‌స్పాట్‌ల‌ను చూపిస్తుంది. ఆ షాప్స్ ఎన్నింటివ‌ర‌కు ఓపెన్ చేసి ఉంటాయో కూడా చూపిస్తుంది. 
* వైఫై హాట్‌స్పాట్ ఉన్న‌లొకేష‌న్‌ను గూగుల్ మ్యాప్ మీద  కూడా మీరు చూసి యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  కొన్ని ఓపెన్ వైఫై హాట్ స్పాట్‌లు ఉంటాయి. వాటిలో నేరుగా వాడుకోవ‌చ్చు. లేదంటే ఆ షాప్ వాళ్ల‌ను అడిగి వాళ్లు పాస్ వ‌ర్డ్ ఇస్తేనే యాక్సెస్ చేసుకోగ‌ల‌రు.

* మీరు వైఫై వాడుకున్నాక లొకేష‌న్ ఆఫ్ చేసుకోవాలంటే  మెనూ ఓపెన్ చేసి యాప్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. లొకేష‌న్ క్లిక్ చేసిలొకేష‌న్ హిస్ట‌రీని ఆఫ్ చేయాలి. 
 

జన రంజకమైన వార్తలు