• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ యూజ‌ర్ల‌ కోసం ఇన్‌స్టంట్ గేమ్స్‌

సోష‌ల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ త‌న మెసెంజ‌ర్ యూజ‌ర్లంద‌రికీ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ గేమ్ ప్లేయింగ్ ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లోజ్డ్ గ్రూప్‌లో చేసిన టెస్టింగ్ స‌క్సెస్‌ఫుల్ కావ‌డంతో ఇప్పుడు మెసెంజ‌ర్ యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను అందించ‌బోతోంది.
120 కోట్ల మందికి అందుబాటులోకి
ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో ఇన్‌స్టంట్ గేమ్స్ ఆడే ఫీచ‌ర్‌ను బీటా వెర్ష‌న్ గా గ‌త న‌వంబ‌ర్‌లో ఫేస్‌బుక్ తీసుకొచ్చింది. ఈ వెర్ష‌న్‌లో టెస్ట్‌ల‌న్నీ స‌క్సెస్‌ఫుల్ కావ‌డంతో త‌న 120 కోట్ల మంది మంత్లీ యూజ‌ర్లంద‌రికీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాక్‌-మాన్ అండ్ గ‌ల‌గా వంటి గేమ్స్ ఇందులో ఉంటాయి.
ట‌ర్న్ బేస్డ్ ప్లేను ప్ర‌వేశ‌పెట్‌ునున్న ఫేస్‌బుక్
ఫేస్‌బుక్ బ్రౌజ‌ర్ హాల్‌మార్క్ అయిన వ‌ర్డ్స్ విత్ ఫ్రెండ్స్‌ను కూడా తిరిగి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొబైల్ గేమింగ్ సెక్టార్లో ఈ గేమ్ తొలిరోజుల్లో మంచి ఫేమ‌స్ అయింది. ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ , ఐవోఎస్ ల నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఈ గేమ్ వెన‌క‌బ‌డింది. దీంతో ఈ గేమ్ రూప‌క‌ర్తయిన జింగా దీన్ని మ‌ళ్లీ తీసుకురానుంది. ఏప్రిల్‌లో జ‌రిగిన ఎఫ్ 8 డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌క‌టించిన‌ట్లుగానే ట‌ర్న్ బేస్డ్ ప్లే ను కూడా ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దీనిలో గేమ్‌మేకర్స్ లీడ‌ర్‌బోర్డ్ ఆప్ష‌న్‌తోపాటు టోర్న‌మెంట్లు కూడా నిర్వ‌హించేందుకు ఛాన్స్ ఉంటుంది.

జన రంజకమైన వార్తలు