• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ ప్రాఫిట్ ల‌క్షా 92 వేల కోట్లు

సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ రోజురోజుకీ భారీగా యూజ‌ర్ల‌ను పెంచుకుంటుంటే దాంతోపాటే ఆదాయం కూడా ల‌క్ష‌ల కోట్ల‌లో పెరుగుతోంది. ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య‌ను ఏకంగా 200 కోట్ల‌కు పెంచుకుంది. ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి క్వార్ట‌ర్ నాటికి 3బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు ( ల‌క్షా 92 వేల కోట్ల రూపాయ‌లు) ప్రాఫిట్ సాధించింది.
మూడు నెల‌ల్లోనే 23,500 కోట్లు
ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు నెల‌ల్లోనే దాదాపు 53 వేల కోట్ల రూపాయ‌ల రెవెన్యూ సాధించింది. దీనిలో 23,500 కోట్ల రూపాయ‌ల ప్రాఫిట్ సాధించిన‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. ఇది గ‌త ఏడాదితో పోల్చితే76% ఎక్కువ‌. వ‌యొలెంట్ కంటెంట్‌ను, లైవ్‌లో హింస చూపించే వీడియోల‌ను మానిట‌ర్ చేసి డిలీట్ చేయ‌డానికి 3వేల మందిని కొత్త‌గా నియ‌మించాల‌నుకోవ‌డం ఫేస్‌బుక్‌పై ఫైనాన్షియ‌ల్‌గా భార‌మైనా అలాంటి కంటెంట్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో సంస్థ ఈ ఖ‌ర్చు భ‌రించబోతోంది.
యాడ్ రెవెన్యూనే ఎక్కువ‌
మెసేజింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్‌).. ఇలా ఫేస్‌బుక్ కు చాలా ఆదాయ మార్గాలున్నాయి. అయితే వీట‌న్నింటి కంటే యాడ్ రెవెన్యూనే ఫేస్‌బుక్ ఆదాయానికి ఆయువుప‌ట్టు. 200 కోట్ల మంది యూజ‌ర్ల‌తో ప్ర‌పంచంలోనే అతిపెద్ద సోష‌ల్ నెట్‌వ‌ర్క్ అయిన ఫేస్‌బుక్ ఆన్‌లైన్ యాడ్ల‌తో వేల కోట్ల రూపాయ‌ల ప్రాఫిట్ సంపాదిస్తోంది. ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ‌లైన ఇన్‌స్టాగ్రామ్‌ను మానిటైజ్ చేయ‌డం, వీడియో యాడ్ కంట్రిబ్యూష‌న్స్ పెంచ‌డం, మ‌రో అనుబంధ సంస్థ వాట్సాప్‌లోనూ యాడ్ల‌తో ఫేస్‌బుక్ ఆదాయం పెరిగింద‌ని సంస్థ ఎన‌లైజ్ చేస్తోందిజ

జన రంజకమైన వార్తలు