• తాజా వార్తలు
  •  

ఎఫ్‌బీ ట్రెండింగ్ డిజైన్ మారింది..

ఇంట‌ర్నెట్ విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌దైపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మీడియా సైట్లు వ‌చ్చాక హ‌ద్దులు చెరిగిపోయాయి. ప్ర‌పంచంలోఏ మూల ఎక్క‌డ ఏం జ‌రుగుతున్నా.. వెంట‌నే తెలిసిపోతుంది. ఐతే ఏమైనా న్యూస్ ట్రెండ్ అయ్యే విష‌యంలో ట్విట‌ర్ అన్నిటికంటే ముందంజ‌లో ఉంటుంది. ఫేస్‌బుక్‌లో చాలా ఫీడింగ్ ఉంటుంది కానీ అందులో ప‌నికొచ్చే స‌మాచారం చాలా త‌క్కువే అని చెప్పాలి. ముఖ్యంగా లేటెస్ట్ వార్త‌ల‌ను అందించే విష‌యంలో కూడా ఇది వెనుకంజ‌లోనే ఉంటుంది. ట్విట‌ర్‌లో ట్రెండింగ్ అయ్యే న్యూస్ ఒక ప‌క్క‌న ఉంటాయి. యూజ‌ర్లు ఈ ట్రెండింగ్‌ను ఫాలో అవ‌తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు తెలుసుకుంటారు. ఐతే ఫేస్‌బుక్‌లోనూ ట్రెండింగ్ ఆప్ష‌న్ ఉన్నా.. అది స‌రిగా ఉండ‌దు. అంటే ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్‌ను స‌రిగా చూపించ‌దు. దీంతో ట్రెండింగ్ తెలుసుకోవ‌డానికి ఎక్కువ‌మంది ట్విట‌ర్‌నే ఫాలో అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న ట్రెండింగ్ ఆప్ష‌న్‌లో స‌మూల మార్పులు చేయాల‌ని ఎఫ్‌బీ నిర్ణ‌యించింది.

కొత్త డిజైన్‌.. కొత్త లుక్‌
ఫేస్‌బుక్ తాజాగా త‌న ట్రెండింగ్ ఆప్ష‌న్ లుక్ మీద దృష్టి పెట్టింది. దీన్ని కొత్త‌గా డిజైన్ చేసి ఇటీవ‌లే అన్‌వీల్ చేసింది. దీని వ‌ల్ల తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎఫ్‌బీ యూజ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే అవ‌కాశం ఉంది. ఫేస్‌బుక్ ప్ర‌వ‌శ‌పెట్టిన ఫిల్ట‌ర్ బ‌బుల్స్ ఆప్ష‌న్ వ‌ల్ల యూజ‌ర్లు స‌రిగా స‌మాచారం అందుకోలేక‌పోతున్నార‌ని.. ఫైగా ఇది కొన్ని న్యూస్ ఏజెన్సీల‌కు ఫేవ‌ర్‌గా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ కొత్త డిజైన్ వ‌ల్ల భిన్న‌మైన వెబ్‌సైట్ల నుంచి వార్త‌ల‌ను అందుకుని వాటిని నేరుగా యూజ‌ర్ల‌కు అందించాల‌ని ఎఫ్‌బీ భావిస్తోంది. ఏదైనా టాపిక్ మీద వార్త‌ల‌ను, స్టోరీల‌ను సుల‌భంగా దొర‌క‌బుచ్చ‌కునేలా ఈ పేజ్‌ను మార్చిన‌ట్లు ఫేస్‌బుక్ త‌న బ్లాగ్‌లో పేర్కొంది.

ఫేక్‌న్యూస్‌కు దూరంగా
అయితే ట్రెండింగ్ అవుతున్న చాలా వార్త‌లు, వీడియోలు చాలా వ‌ర‌కు ఫేక్ కావ‌డం ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌కే చిక్కులు తెచ్చిపెట్టింది. అందుకే ఫేక్ న్యూస్‌ను స్ర్పెడ్ చేయ‌కుండా చూడ‌టానికి ఎఫ్‌బీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్ర‌పంచంలో పేరొందిన వార్తా సంస్థ‌ల‌తో ఎఫ్‌బీ టై అప్ కూడా చేసుకుంది. అంటే ఏమైనా వార్త బ్రేక్ అయితే అది నిజ‌మా కాదా అని క్రాస్ చెస్ చేసిన త‌ర్వాతే ట్రెండింగ్‌లో పెట్టేలా చూడాల‌ని ఫేస్‌బుక్ ప్ర‌య‌త్నిస్తోంది. నిజానికి ఇది చాలా క‌ష్ట‌మైన విష‌య‌మే అయినా వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొన‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఎఫ్‌బీ బ్లాగు పోస్ట్‌లో తెలిపింది. ఫేస్‌బుక్ డిజైన్ చేసిన ఈ కొత్త లుక్ ఉన్న ట్రెండింగ్ ఆప్ష‌న్ యూఎస్‌లో ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు ల‌భ్యం అవుతోంది. త్వ‌ర‌లో అన్ని ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌కు ఇది అందుబాటులోకి వ‌స్తుందని ఎఫ్‌బీ తెలిపింది.

జన రంజకమైన వార్తలు