• తాజా వార్తలు
  •  

 ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌లో సెకండ్ ప్లేస్‌లో ఇండియా..  20 కోట్లు దాటిన  యూజ‌ర్లు..

ఫేస్‌బుక్‌.. ఇండియాలో దూసుకుపోతోంది.  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అందులో క‌చ్చితంగా ఫేస్ బుక్ యాప్ ఉంటోంది.  పెద్ద‌గా చ‌దువురానివారు కూడా ఫేస్‌బుక్‌ను యూజ్ చేయ‌గ‌లుగుతున్నారు. ఫొటోస్ పోస్ట్ చేయ‌డం, లైక్స్ కొట్ట‌డం ఈజీ ప్రాసెస్ కావ‌డంతో చాలామంది దీని యాక్సెస్ ఈజీ అయింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం ఇండియాలో ఫేస్‌బుక్ యాక్టివ్  యూజ‌ర్ల సంఖ్య 20 కోట్లు దాటింద‌ని ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. యూఎస్ త‌ర్వాత అత్య‌ధిక మంది ఫేస్‌బుక్ యూజ‌ర్లున్న‌ది మ‌న దేశంలోనే కావ‌డం విశేషం.  21 కోట్ల 40 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ బేస్‌తో యూఎస్ ..  ఫేస్‌బుక్ లో నెంబ‌ర్‌వ‌న్‌గా ఉంది.  
మొబైల్ యూజ‌ర్లే ఎక్కువ‌
మొబైల్ యాప్ వ‌చ్చాకే ఫేస్‌బుక్ బాగా పెనిట్రేట్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజూ 123 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను చూస్తున్నారు. దీనిలో 115 చోట్ల మంది మొబైల్ డివైస్‌ల్లోనే ఫేస్‌బుక్‌ను చూస్తున్నారు.  ఇండియాలో కూడా  జియో రాక‌తో మొబైల్ డేటాను కంపెనీలు పోటీప‌డి త‌గ్గిస్తుండడం కూడా ఫేస్‌బుక్ ఈ స్థాయిలో స‌క్సెస్ అవుతోంది. 

జన రంజకమైన వార్తలు