• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్‌లో అస‌భ్య చిత్రాలు కుద‌ర‌విక‌

ప్ర‌పంచంలో ఎక్కుమంది ఉపయోగిస్తున్న సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో ఫేస్‌బుక్ ముందుంటుంది. ఎక్క‌డెక్కడో ఉన్న వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మ‌ళ్లీ అంద‌రిని క‌లిపిన అద్భుతం ఫేస్‌బుక్‌. ఐతే ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అంత‌కంటే ఎక్కువ‌గా న‌ష్టాలు కూడా ఉన్నాయి. రాను రాను ఎఫ్‌బీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతోంది. ఫొటోల‌ను మార్ఫింగ్ చేయ‌డం, అస‌భ్య సందేశాలు పంపించ‌డం, స‌మాజానికి చేటు చేసే మెసేజ్‌ల‌ను షేర్ చేయ‌డం ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ముఖ్యంగా అమ్మాయిలు దీనికి ఎక్కువ‌గా బ‌ల‌వుతున్నారు. అమ్మాయిల‌తో స‌న్నిహితంగా ఉండే అబ్బాయిలే అస‌భ్యంగా ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. దీని వ‌ల్ల కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఫొటోలు, వీడియోలు విష‌యంలో క‌ఠినంగా వ్య‌వహ‌రించాల‌ని ఫేస్‌బుక్ నిర్ణ‌యించుకుంది.
త‌మ‌కు అస‌భ్య సందేశాలు, ఫొటోలు, వీడియోలు క‌నిపిస్తే వాటిని అబ్యూజివ్ కంటెంట్ కింద రిపోర్ట్ చేయ‌డానికి ఒక ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఫేస్‌బుక్ భావిస్తోంది. దీని వ‌ల్ల రిపీటెడ్‌గా షేర్ అయ్యే అభ్యంత‌ర‌క‌ర ఫొటోల‌ను క‌నిపెట్టి వాటిని నిసేధించొచ్చ‌నేది ఆ సంస్థ వ్యూహం.వ్య‌క్తుల అనుమ‌తి లేకుండా వ‌చ్చే ఎలాంటి ఫొటోలు, వీడియోల‌నైనా వెంట‌నే రిపోర్టు చేయాల‌ని ఎఫ్‌బీ కోరింది. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫొటోలు పెట్టి, మార్ఫింగ్ చేసి వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసే వారి ఆట క‌ట్టించ‌డానికి కూడా ఫేస్‌బుక్ తాజా నిర్ణ‌యం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వినియోగదారులు అంటున్నారు. అంతేకాకుండ కొన్ని వ‌ర్గాల‌ను లక్ష్యంగా చేసుకుని కొన్ని వ‌ర్గాలు అబ్యూజివ్ కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నాయి. దీని వ‌ల్ల మ‌నోభావాలు బాగా దెబ్బ‌తింటున్నాయి.
ఈ ప‌రిస్థితిని నియంత్రించ‌డానికి కూడా ఫేస్‌బుక్ కంకంణం క‌ట్టుకుంది. అలాంటి అబ్యుజివ్ కంటెంట్ ఎఫ్‌బీలో వ‌స్తే వెంట‌నే నిషేధించాల‌ని నిర్ణ‌యించుకుంది. రిపీటెడ్‌గా షేర్ అవుతున్న అస‌భ్య కంటెంట్‌ను ఆటొమెటిక్‌గా బ్యాన్ చేయ‌డానికి ఫేస్‌బుక్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అబ్యుజివ్ కంటెంట్ ఎఫ్‌బీలో పోస్ట్ చేస్తే ఫ్రొఫైల్ బ్లాక్ చేస్తామ‌ని 2015లోనే క‌ఠిన ఆదేశాలు ఇచ్చినా..వినియోగ‌దారులు ప‌ట్టించ‌కోక‌పోవ‌డంతో నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయాల‌ని ఎఫ్‌బీ ప్ర‌య‌త్నిస్తోంది.

జన రంజకమైన వార్తలు