• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియోల మానిట‌రింగ్‌కు 3వేల మంది ఎంప్లాయిస్

సోష‌ల్ నెట్‌వ‌ర్క్ జెయింట్ ఫేస్‌బుక్ త‌న సోష‌ల్ నెట్‌వ‌ర్క్ లో ఉన్న ఫీచ‌ర్ల‌ను ఎవ‌రూ మిస్ యూజ్ చేయ‌కుండా చ‌ర్య‌లు ప్రారంభించింది. గ‌త నెల‌లో ఫేస్‌బుక్ లైవ్ వీడియోల్లో ఆత్మ‌హ‌త్య‌లు టెలికాస్ట్ అయిన ఘ‌ట‌న‌తో అలెర్ట్ అయిన ఫేస్‌బుక్ దీనిపై వెంట‌నే యాక్ష‌న్ స్టార్ట్ చేసింది. అసంబద్ధ‌మైన మెటీరియల్స్‌, లైవ్ వీడియోల‌ను మానిట‌ర్ చేసి తొల‌గించ‌డానికి ఏకంగా 3వేల మంది ఎంప్లాయిస్‌ను నియ‌మించుకోబోతున్న‌ట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించారు.
వ‌యొలెన్స్‌ను చూపించ‌కుండా కంట్రోల్
ఫేస్‌బుక్‌లో అసంబ‌ద్ధ‌మైన కంటెంట్ ఎక్కువ‌గా వ‌స్తోంద‌ని ఇటీవ‌ల కంప్లెయింట్స్ ఎక్కువ‌య్యాయి. దీంతోపాటు మ‌ర్డ‌ర్లు, సూసైడ్‌ల‌ను లైవ్ వీడియోల ద్వారా చూపించేందుకు కొంద‌రు ఫేస్‌బుక్‌ను వేదిక‌గా వాడుకుంటున్నారు. గ‌త ఏడాది ఫేస్‌బుక్ లైవ్ వీడియోస్ ఆప్ష‌న్ను త‌న యూజ‌ర్ల కోసం తీసుకొచ్చింది. అయితే దీన్ని చాలా మంది వయొలెన్స్ చూపించ‌డానికి వాడుతున్నారు. లాస్ట్ వీక్ థాయ్‌లాండ్‌లో ఒక వ్య‌క్తి త‌న క‌న్న‌కూతుర్ని మ‌ర్డ‌ర్ చేసిన వీడియోను ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో అప్‌డేట్ చేశాడు. దీన్ని 3ల‌క్ష‌ల 70 వేల మంది చూశాక ఫేస్‌బుక్ దాన్ని తొల‌గించింది. షికాగో, క్లీవ్‌లాండ్‌ల నుంచి కూడా ఇలాంటి ఇన్సిడెంట్లే జ‌రిగాయి. ఇలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసి అలాంటి కంటెంట్‌ను, వీడియోల‌ను డిలీట్ చేసేందుకు 3వేల మంది ఎంప్లాయిస్‌ను వ‌చ్చే ఏడాది కాలంలో నియ‌మించ‌బోతున్న‌ట్లు జుకెర్‌బ‌ర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో అనౌన్స్ చేశారు.
ఇప్ప‌టికే 4,500 మంది వ‌ర్క‌ర్లు
ఇలాంటి కంటెంట్ ఉన్న పోస్టుల‌ను రివ్యూ చేసి ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌వాటిని తొల‌గించేందుకు ఇప్ప‌టికే ఫేస్‌బుక్ 4,500 మంది వ‌ర్క‌ర్ల‌ను నియ‌మించింది. వీరికి తోడు మ‌రో 3వేల మందిని నియ‌మించ‌బోతున్న‌ట్లు జుకెర్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించారు.

జన రంజకమైన వార్తలు