• తాజా వార్తలు
  •  

ఇక ఫేస్‌బుక్‌ నుంచే ఫుడ్‌ ఆర్డర్ చేసేయొచ్చు

ఫేస్‌బుక్ చాటింగ్‌లో ప‌డి నిద్రాహారాలు మ‌ర్చిపోయేవారి కోసం కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. చాటింగ్‌లో ప‌డి ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌డం కూడా మ‌ర్చిపోయే బిజీ యూజ‌ర్ల కోసం ఆ సంస్థ మ‌రో ఫెసిలిటీ క‌ల్పిస్తుంది. ఫుడ్ ఆర్డ‌ర్ కోసం మ‌రో యాప్ డౌన్ లోడ్ చేసుకోకుండా నేరుగా ఫేస్‌బుక్‌లో నుంచే ఆర్డ‌ర్ ఇవ్వ‌డం దీని ప్ర‌త్యేకత‌. ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ చేస్తోంది. యూఎస్ లోని కొంద‌రు యూజ‌ర్లు దీన్ని యూజ్ చేసుకునే అవ‌కాశం ఇచ్చింది. త‌ర్వాత ఫేస్‌బుక్ త‌న కోట్లాది మంది యూజ‌ర్ల‌కూ దీన్ని అందుబాటులోకి తెస్తుంది.
ఆర్డ‌ర్, ట్రాక్ అన్నీ..
ఆహారపదార్థాల ఆర్డర్‌ కోసం ఫేస్‌బుక్‌ యాప్‌లో యాప్స్ మెనూ ఏరియాలో ఆర్డ‌ర్ ఫుడ్ అనే ఐకాన్ ఉంటుంది. ఇది లైట్ బ్లూ క‌ల‌ర్‌లో హ్యాంబ‌ర్గ‌ర్‌లా క‌నిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ లేదా సిస్టంలో ఉన్న లొకేష‌న్ యాక్సిస్‌ను బ‌ట్టి ద‌గ్గ‌ర్లో ఉన్న రెస్టారెంట్లు , అందులో ఏ డిషెస్ ఉన్నాయి లాంటి డిటెయిల్స‌న్నీ చూపిస్తుంది. కావాల్సిన‌వి ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. ఆర్డర్ ను ట్రాక్ చేయొచ్చు కూడా.
కొత్త‌గా యాప్ అవ‌స‌రం లేదు
ఫేస్‌బుక్‌లో ఈ ఫీచ‌ర్‌తో లాభ‌మేంటంటే సెప‌రేట్‌గా ఫుడ్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ఇన్‌స్టాల్ చేసుకోవ‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఫేస్‌బుక్ లో ప‌డితే అంత వేగంగా బ‌య‌టికి రాని వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఛాటింగ్ చేస్తూనో, పోస్టింగ్‌లు చూస్తూనో ప‌నిలోప‌నిగా ఫుడ్ ఆర్డ‌ర్ చేసేసుకోవ‌చ్చు. ఫోన్లో ఫుడ్ యాప్‌ల ఇన్‌స్టాలేష‌న్ అవ‌స‌రం లేదు కాబ‌ట్టి మెమ‌రీ, డేటా కూడా మిగులుతుంది.

జన రంజకమైన వార్తలు