• తాజా వార్తలు
  •  

ఫేస్ బుక్ ఇతరుల నుంచి కాపీ కొట్టిన మూడు ముఖ్యమైన ఫీచర్లు

ఫేస్ బుక్ అంటే ఒక ట్రెండు సెట్టర్.. ఒక ఇన్ స్పిరేషన్. దాన్నుంచి ఎన్నో బిజినెస్ ఐడియాలు.. ఫేస్ బుక్ ను కాపీకొట్టిన సోషల్ మీడియా యాప్స్ ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో ఫేస్ బుక్ కూడా ఇతరుల నుంచి కొన్ని ఫీచర్లను కాపీ కొట్టిందట. అలాంటి ఓ మూడు కాపీ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
స్నాప్ చాట్ నుంచి కెమేరా ఫీచర్లు..
మొన్న మార్చి నెలలో ఫేస్ బుక్ కెమేరా ఎఫెక్ట్సు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇది స్నాప్ చాట్ నుంచి డైరెక్టుగా ఎత్తేసిన ఫీచర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఫేస్ బుక్ స్టోరీస్.. ఇది కూడా స్నాప్ చాట్ నుంచే..
కెమేరా ఎఫెక్ట్సు తీసుకొచ్చిన సమయంలో ఫేస్ బుక్ స్టోరీస్ ఆప్షన్ కూడా తెచ్చింది. డైలీ స్టోరీ సెక్షన్లో కొన్ని వీడియోలు, ఫొటోలు షేర్ చేసుకోవచ్చు. ఇది కూడా స్నాప్ చాట్ నుంచి కాపీ కొట్టిన ఫీచరే.
130 అక్షరాల పరిమితి... ట్విటర్ నుంచి కాపీ
ఫేస్ బుక్ లో కొత్తగా పోస్టింగ్ చేస్తే రకరకాల బ్యాక్ గ్రౌండ్లతో అందంగా కనిపిస్తోంది. బట్... అక్షరాల పరిమితి మాత్రం 130 కి మించదు. ఇది ట్విట్టర్ ఫీచర్ కు కాపీ.

జన రంజకమైన వార్తలు