• తాజా వార్తలు
  •  

ఎవరూ ట్యాగ్ చేయ‌క‌పోయినా ఎఫ్‌బీ మ‌న ఫొటోల్ని ఎలా గుర్తిస్తుంది? 

ఫేస్‌బుక్‌లో ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ట్యాగ్ చేస్తే అందులో మీ ఫొటోను గుర్తించేది. కానీ ఇప్పుడు అలా చేయ‌క‌పోయినా ఫేస్‌బుక్ ..ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ ద్వారా మీ ఫేస్‌ను గుర్తిస్తుంది. అందుకే మీకు తెలియ‌కుండా ఎవ‌రైనా మీ ఫొటోను లేదా మీరున్న గ్రూప్ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వెంట‌నే మీకు తెలిసిపోతుంది.  దాదాపు 200 కోట్ల మంది యూజ‌ర్లున్న ఫేస్‌బుక్‌లో ఈ ఫీచ‌ర్ ఎలా ప‌నిచేయ‌గ‌లుగుతుంది?  దీంతో యూజ‌ర్‌కు లాభ‌మా, న‌ష్ట‌మా?  తెలియాలంటే ఈ ఆర్టిక‌ల్‌ను చ‌దివేయండి. 
ఎలా ప‌ని చేస్తుంది? 
ఫేస్‌బుక్ త‌న సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ను మ‌రింత ప్ర‌ముఖంగా వాడ‌డం మొద‌లుపెట్టింది. దీంతో ఏ యూజ‌రైనా అప్‌లోడ్ చేసిన  ఫొటోలో మీ ఫేస్ గ‌నుక ఉంటే వెంట‌నే మీకు తెలియ‌జెబుతుంది. 
* ఫేషియ‌ల్  రిక‌గ్నైజేష‌న్ ఆల్గ‌రిథ‌మ్స్ ద్వారా ఫేస్‌బుక్  మీ ఫోటోలను విశ్లేషించి, మీ ముఖ లక్షణాలతో మ్యాచ్ అయ్యే టెంప్లేట్‌ను త‌యారు చేస్తుంది.
* ఎవ‌రైనా పోస్ట్ చేసిన ఫొటో ఈ టెంప్లేట్‌తో మ్యాచ్ అయితే వెంట‌నే మీకు నోటిఫికేష‌న్ వ‌స్తుంది.  
 * డిసెంబ‌ర్ 19 నుంచి అప్‌లోడ్ అవుతున్న కొత్త ఫొటోల‌న్నింటిలోనూ ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. 
* మీకు ఫేస్‌బుక్‌లో ఈ ఆప్ష‌న్ కావాలంటే  Settings -> Timeline లోకి వెళ్లి  Who sees tag suggestions when photos that look like you are uploaded? అనే ఆప్ష‌న్‌ను ట్యాగ్ చేసుకోవాలి. 
పాత ఫీచ‌రే ..కొత్త‌గా 
నిజానికి ఈ ఫీచ‌ర్ 2010 నుంచే ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్‌కు ప్రాధాన్యం పెర‌గ‌డంతో ఈ ఫీచ‌ర్ కొంత డెవ‌ల‌ప్ అయిందంతే. ఏదేమైనా ఈ ఫీచ‌ర్ వ‌ల్ల యూజ‌ర్ల‌కు మంచే జ‌రుగుతుంది. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో మీ ఫొటోలు, వీడియోలు ఎవ‌రైనా పెట్టినా వెంట‌నే మీకు నోటీసు వ‌స్తుంది. ముఖ్యంగా లేడీస్ ఫొటోలు పెట్టి బెదిరించి, వేధించేవారు పెరుగుతున్న‌సంద‌ర్భంలో ఇలా మీ ఫొటో పెట్ట‌గానే వెంట‌నే మీకు నోటిఫికేష‌న్ వ‌స్తే ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యే యాక్ష‌న్ తీసుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు