• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ ఆధార్ అడిగింద‌న్న‌దాంట్లో వాస్త‌వాలేంటి?

మొబైల్ సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తో లింక్ తప్ప‌నిస‌రంటోంది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే గ్యాస్ క‌నెక్ష‌న్‌, పాన్‌కార్డ్‌, బ్యాంక్ అకౌంట్‌, పీఎఫ్ అకౌంట్‌, రేష‌న్ కార్డ్ లాంటి అన్ని ఇంపార్టెంట్ అవ‌స‌రాల‌కు ఆధార్‌ను లింక్ చేసేశారు. మొబైల్ ఆధార్ లింకేజికి మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే గ‌డువుంది. ఇప్పుడు కొత్త‌గా ఫేస్‌బుక్ ఆధార్ అడిగింద‌న్న‌ప్ర‌చారం  మ‌రింత క‌ల‌కలం సృష్టించింది.
అస‌లేం జ‌రిగింది?
ఫేస్‌బుక్ ఆధార్ లింక్ చేయ‌మని అడిగింద‌ని కొన్ని పోస్టులు వ‌చ్చాయి. దీన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు.కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ఇది నిజ‌మేన‌న్న‌ట్లు వార్త‌లు రాసిపారేశాయి. కానీ వాస్తవంగా అలాంటిదేమీ జ‌ర‌గ‌దు.  ఫేస్‌బుక్ కొత్త‌గా ఎవ‌రైనా సైన్ అప్ అవుతున్న‌ప్పుడు డిటెయిల్స్‌లో రియ‌ల్ నేమ్ మాత్ర‌మే రాయాల‌ని స‌జెస్ట్ చేస్తుంది. నిక్ నేమ్స్‌, పెట్ నేమ్స్ కాకుండా అస‌లు పేరురాస్తే మీ ఫ్రెండ్స్ మిమ్మ‌ల్ని ఈజీగా రిక‌గ్నైజ్ చేయ‌గ‌లుగుతార‌ని దానిలో రాసి ఉంటుంది. ఇప్పుడు దాన్నే మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు రాయండి(ఎందుకంటే అది క‌చ్చితంగా ఒరిజిన‌ల్ పేరే ఉంటుంది).మీ ఫ్రెండ్స్ మిమ్మ‌ల్ని ఫేస్‌బుక్‌లోఈజీగా గుర్తించ‌డానికి వీల‌వుతుంద‌ని రాసి పెట్టారు.
క్లారిటీ ఇచ్చిన ఫేస్‌బుక్‌
ప్ర‌పంచంలో ఫేస్‌బుక్ యూజ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న రెండో పెద్ద దేశం మ‌న‌ది. ఇక్క‌డ ఇప్ప‌టికే ఆధార్ మీద బోల్డ‌న్ని అపోహ‌లున్నాయి. ఆధార్ నంబ‌రిస్తే త‌మ వివ‌రాల‌న్నీ తెలిసిపోతాయ‌ని భ‌యం బాగా ఉంది.అందుకే అత్యవ‌స‌ర‌మ‌ని గ‌వ‌ర్న‌మెంట్ గ‌ట్టిగా చెప్పి,రూల్ స్ట్రిక్ట్ చేస్తే త‌ప్ప ఆధార్ నెంబ‌ర్‌తో దేన్నీ లింక్‌చేయ‌డం లేదు. అలాంటిది కేవ‌లం స‌ర‌దా కోసం ఓపెన్ చేసే ఫేస్‌బుక్ అకౌంట్‌కి ఆధార్ నెంబ‌ర్ అనేస‌రికి అంద‌రూ కంగారుప‌డ్డారు.అందుకే ఫేస్‌బుక్ అల‌ర్ట్ అయింది.  అస‌లు పేరు తెలుసుకుంటే ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ గుర్తుప‌ట్ట‌డానికి వీలుగా ఉంటుంద‌ని అడిగామే త‌ప్ప ఆధార్ నెంబ‌ర్‌తో మేం ఎవ‌ర్నీ ఇంట‌రాగేట్ చేసేది లేదు.. ఎవ‌రిపైనా ఎంక్వ‌యిరీ చేయాల‌ని అనుకోవ‌డం లేదు. మీకు ఇష్టం లేక‌పోతే మీకు న‌చ్చిన‌పేరు పెట్టుకోవ‌చ్చ‌ని బ్లాగ్‌లో క్లియ‌ర్‌గా క్లారిటీ ఇచ్చింది. 

జన రంజకమైన వార్తలు