• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్‌లో మ‌న ఫోటోల‌పై  ఎఫ్‌బీకి ఉన్న హ‌క్కులేంటి?

సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌ను చ‌దువులేనివాళ్ల‌కు కూడా దగ్గ‌ర చేసిన ఘ‌న‌త ఫేస్ బుక్‌ది.  100 కోట్ల మందికి పైగా యూజ‌ర్లున్న ఎఫ్‌బీలో రోజూ కొన్ని కోట్ల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిని షేర్ చేస్తుంటారు. లైక్ చేస్తారు. కామెంట్ చేస్తారు. కానీ ఆ ఫొటోలు మీ ఒక్క‌రికే సొంత‌మా?  మీ ఫొటోల‌మీద ఎఫ్‌బీకి కూడా రైట్స్ ఏమ‌న్నా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా.

ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసేట‌ప్పుడు బోల్డ‌న్ని ప‌ర్మిష‌న్లు అడుగుతుంది. మ‌న‌లో నూటికి 99శాతం మందికి వాటికి వంక చూడ‌కుండానే యాక్సెప్ట్ చేసేస్తాం.  ఎందుకంటే ఎఫ్‌బీలో మీరు పోస్ట్ చేసే ఫొటో లేదా కంటెంట్ పూర్తిగా మీకే సొంతం  ఫేస్‌బుక్ ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్ల‌లో స్ప‌ష్టంగా ఉంటుంది. అంత మాత్రాన ఫేస్‌బుక్ మ‌న ఫొటోల‌ను వాడుకోదా అంటే అవున‌ని చెప్ప‌లేం. ఎందుకంటే ఫేస్‌బుక్ ట‌ర్మ్స్‌లోనే మ‌రో రూల్ కూడా ఉంది.  ‘non-exclusive, transferable, sub-licensable, royalty-free, worldwide license’ to your photos అనేది ఆ రూల్ .

 దీని ప్ర‌కారం
* ఫేస్‌బుక్ మీ ఫొటోల‌ను మీ ప‌ర్మిష‌న్ లేకుండా వేరొకరికి స‌బ్‌లైసైన్స్ కింద ఇవ్వ‌చ్చు. 
* మీ ఫొటోను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా, ఎన్నిసార్ల‌యినా ఎఫ్ బీవాడుకోవ‌చ్చు.
* ఇవ‌న్నీ మీ ప‌ర్మిష‌న్ లేకుండా, మీకు పైసా కూడా క‌ట్ట‌క్క‌ర్లేకుండా, ఆఖ‌రికి మీకు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌క్క‌ర్లేకుండా చేసేయొచ్చు. 
అయితే మీరు మీ ఫొటోల‌ను ఎవ‌రు చూడొచ్చు అని సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెట్ చేసుకోవ‌చ్చు.  ఓన్లీ ఫ్రెండ్స్‌, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌, ప‌బ్లిక్ అని ర‌క‌ర‌కాలుంటాయి.  ఓన్లీ ఫ్రెండ్స్ అని పెట్టి లేదా లిమిటెడ్ స‌ర్కిల్‌కే ప‌రిమితం చేసిన‌ప్పుడు ఈ  ఫొటోను ఫేస్ బుక్ వాడడానికి అవ‌కాశాలు చాలా చాలా త‌క్కువ‌. 
నిజంగా చేస్తుందా? 
కానీ ఇన్ని కోట్ల మంది యూజ‌ర్ల‌ను సొంతం చేసుకున్న ఫేస్‌బుక్ అలాంటి పిచ్చిప‌ని చేయ‌దు. ఒక్క‌సారి అలాంటిదేదైనా జ‌రిగి ఇష్యూ అయితే ఎఫ్‌బీలో ఫొటో పెట్ట‌డానికి చాలా మంది వెన‌కాడ‌తారు. అది సైట్ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం తేవ‌చ్చు. అందుకే అలాంటివేవీ చేయ‌దు. మ‌రి ఎందుకు ఈ రూల్ ఉంటుంది. పొర‌పాటున ఎప్పుడైనా ఇలా జ‌రిగినా ఎవ‌రూ ఎలాంటి లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోకుండా సేఫ్‌గార్డ్‌గా ఉండ‌డానికే ఇలాంటి రూల్స్ ఫ్రేం చేసింది. అంతేకాదు ఈ రూల్ పెట్ట‌క‌పోతే మీరు పోస్ట్ చేసిన ఫొటోను మీ ఫ్రెండ్‌కు చూపించ‌డానికి కూడా కాపీరైట్ యాక్ట్ అడ్డు వ‌స్తుంది. మీరు పోస్ట్ చేసిన ఫొటో ఎవ‌రూ చూడ‌క‌పోతే ఇక అది పోస్ట్ చేసి ఉప‌యోగ‌మేంటి?  కాబ‌ట్టే ఇలాంటి రూల్స్ పెట్టింది త‌ప్ప మీ ఫొటోలు వాడుకోవ‌డానికి కాదు.  

జన రంజకమైన వార్తలు