• తాజా వార్తలు
  •  

ఫేస్‌బుక్ బ్లూ కల‌ర్ లో మాత్ర‌మే ఎందుకు ఉంటుందో.. తెలుసా?

ఫేస్‌బుక్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో రారాజుగా.. ఎక్క‌డెక్క‌డి వారినో క‌లుపుతున్న ఫేస్‌బుక్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఫేస్‌బుక్ సైట్‌, యాప్‌, పాప్ అప్స్‌తో స‌హా అన్ని బ్లూ క‌ల‌ర్‌లోనే ఉంటాయ‌ని యూజ‌ర్లంద‌రికీ తెలుసు. ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఫేస్‌బుక్ బ్లూ క‌ల‌ర్‌నే ఎందుకు మెయింన్‌టెయిన్ చేస్తుందో తెలుసా? అస‌లు ఆ ఆలోచ‌నే ఎవ‌రికీ వ‌చ్చుండదు క‌దా.. కానీ దాని వెనుక చాలా ఆస‌క్తిక‌ర‌మైన రీజ‌న్స్ ఉన్నాయి.అ వేమిటో చూడండి
జుకెర్‌బ‌ర్గ్‌కు క‌ల‌ర్ బ్లైండ్‌నెస్‌
ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో జుకెర్‌బ‌ర్గ్ కి కొద్దిగా క‌ల‌ర్ బ్లైండ్‌నెస్ ఉంది. అంటే రెడ్‌, గ్రీన్‌వంటి కొన్ని క‌ల‌ర్స్‌ను ఆయ‌న స్ప‌ష్టంగా గుర్తించ‌లేడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పాడు. బ్లూక‌ల‌ర్‌ను జుకెర్‌బ‌ర్గ్ బాగా గుర్తించ‌గ‌ల‌డ‌ట‌. అందుకే ఫేస్‌బుక్ బ్లూ క‌ల‌ర్‌లోనే ఉంటుంది.
బ్లూ అంటే న‌మ్మ‌కం
బ్లూ క‌ల‌ర్ అంటే న‌మ్మకం, నిజాయ‌తీ, విశ్వ‌స‌నీయ‌త‌కు గుర్తు అని చెబుతారు. వాట‌న్నింటికీ ఫేస్‌బుక్ ప్ర‌తినిధిగా ఉండాల‌నే ఉద్దేశంతోనే ఫేస్‌బుక్‌ను బ్లూక‌ల‌ర్‌లోనే డిజైన్ చేశారు. అంతేకాదు బ్లూ క‌ల‌ర్ యువ‌త తాము పెద్ద‌వాళ్ల‌మ‌య్యామని ఫీల్ అవ‌డానికి సింబ‌ల్‌గా ఫీల్ అవుతారని కూడా ఓ విశ్లేష‌ణ ఉంది. ఫేస్‌బుక్‌ను ఎక్కువ‌గా యూజ్ చేసేది యూతే కాబ‌ట్టి వాళ్ల‌కోసం బ్లూ క‌ల‌ర్‌లోనే ఉంచుతున్నార‌న్న‌ది మ‌రో విశ్లేష‌ణ‌. అంతేకాదు ప్ర‌పంచంలో టాప్ 100 వెబ్‌సైట్ల‌లో రెడ్ త‌ర్వాత ఎక్కువ‌గా కనిపించేది నీలం రంగే. త‌మ సైట్ టాప్‌లో ఉండాల‌న్న ఉద్దేశంతో ఫేస్‌బుక్ బ్లూక‌ల‌ర్‌నే ప్రిఫ‌ర్ చేస్తుంది.
మార్కెటింగ్ స్ట్రాట‌జీ
ఫేస్‌బుక్ బ్లూ క‌ల‌ర్‌లోనే ఉండ‌డంలో మార్కెటింగ్ వ్యూహం కూడా ఉంది. ఎక్కువ సేపు చూస్తే చాలా రంగులు కంటిని స్ట్రెయిన్ చేస్తాయి. రెడ్‌, ఎల్లో లాంటి వైబ్రంట్ క‌ల‌ర్స్‌తో ఈ ఎఫెక్ట్ ఎక్కువ‌. వాటితో కంపేర్ చేస్తే బ్లూ కామ్ క‌ల‌ర్. అంతేకాదు మెద‌డుకు హాయినిస్తుంటద‌ట‌. అందుకే బ్లూ క‌ల‌ర్ వాడుతున్నారు. అంతేకాదు బ్లూక‌ల‌ర్‌ను మెడిక‌ల్‌, సైంటిఫిక్‌, ఐటీ, గ‌వ‌ర్న‌మెంట్‌, హెల్త్‌కేర్‌, హైటెక్‌, లీగ‌ల్‌, డెంట‌ల్ వంటి సెక్టార్ల‌లో ఎక్కువ‌గా యూజ్ చేస్తారు. ఆ సెక్టార్ల‌లోని పీపుల్‌కు చేరువ కావ‌డానికి కూడా ఫేస్‌బుక్ బ్లూ క‌ల‌ర్‌నే మెయిన్‌టెయిన్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు