• తాజా వార్తలు
  •  

ఎఫ్‌బీలో మీ ఫోన్ నంబ‌ర్‌తో సెర్చ్ చేయ‌డానికి ఎందుకు ఒప్పుకోకూడ‌దు?

ఫేస్‌బుక్ వాడ‌ని వాళ్లు ఎవ‌రు! స్మార్ట్‌ఫోన్లు వాడే వాళ్లు క‌చ్చితంగా  ఫేస్‌బుక్ యాప్ తమ ఫోన్‌లో ఉంచుకుంటారు. అంత‌గా జ‌నాల‌కు  క‌నెక్ట్ అయిపోయింది ఈ సోష‌ల్‌మీడియా సైట్‌. ఎఫ్‌బీ చూసేట‌ప్పుడు మ‌నం ఒక విష‌యాన్నిగ‌మ‌నిస్తాం. అదే ఫోన్ నంబ‌ర్‌.  చాలామంది ఎఫ్‌బీలో ఫోన్ నంబ‌ర్ పెట్టేస్తుంటారు. ఇది ఒక్కోసారి పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. ఫోన్ నంబ‌ర్ ద్వారా లాగిన్ కావొచ్చ‌నే ఆప్ష‌న్ దీనిలో ఉంటుంది. అయితే ఎఫ్‌బీలో ఫోన్ నంబ‌ర్ వాడ‌డం అంత మంచిది కాదు.  దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

ప్రైవ‌సీకి దెబ్బ‌
చాలా మంది ప్రైవ‌సీ కోరుకుంటారు. త‌మ ఫోన్ నంబ‌ర్ ఎవ‌రీకి ఇవ్వ‌రు. కానీ వాళ్లు ఒక  త‌ప్పు చేస్తారు. అదే ఎఫ్‌బీలో ఫోన్ నంబ‌ర్ ఉంచ‌డం. ఇది వాళ్లు కావాల‌ని చేసే ప‌ని కాదు.  ఒక్కోసారి  ఎఫ్‌బీ మీ అకౌంట్‌ను ఫోన్ నంబ‌ర్‌తో చెక్ చేసుకోమ‌ని చెబుతుంది. అప్పుడు మ‌నం ఫోన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేస్తాం. అయితే ఓటీపీ చెకింగ్ అయిపోయిన త‌ర్వాత ఆ ఫోన్ నంబ‌ర్‌ని డిలీట్ చేయ‌డం మ‌రిచిపోతాం. మ‌నం చేసే త‌ప్పు ఇదే. మిమ్మల్ని డిస్ట‌ర్బ్ చేయాల‌నుకున్న వాళ్లు ఈ నంబ‌ర్‌ను ఫేస్‌బుక్ ద్వారా సుల‌భంగా ట్రేస్ చేయ‌చ్చు. 

నంబ‌ర్ ద్వారా ఎఫ్‌బీ
కొంత‌మంది ఎఫ్‌బీ అకౌంట్ ఎవ‌రికి చెప్ప‌డం ఇష్టం ఉండ‌దు. కానీ  మ‌న‌కు తెలియని వ్య‌క్తులు మ‌న వివ‌రాలు  తెలుసుకునేందుకు ఎఫ్‌బీని ట్రేస్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అదెలా అంటారా?..దానికీ మ‌న ఫోన్ నంబ‌రే కార‌ణం.  మన ఫోన్ నంబ‌ర్ ఉంటే చాలు... దాని ఆధారంగా కూడా ఎఫ్‌బీ అకౌంట్‌ను ట్రేస్ చేసే అవ‌కాశాలున్నాయి. అందుకే మ‌న ఎఫ్‌బీ అకౌంట్లో ఫోన్ నంబ‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే  బెట‌ర్‌.  ముఖ్యంగా హ్యాక‌ర్ల‌కు ఫోన్ నంబ‌ర్ దొరికినా చాలు.. మ‌న అకౌంట్‌ను హ్యాక్ చేసే అవ‌కాశాలున్నాయి.

బ్లాక్ చేసేయండి
మీ ఎఫ్‌బీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే ముందు  జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి.  సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవ‌సీ ప్రాధామ్యాల‌ను మార్చుకోవాలి.  మీకు సంబంధించిన స‌మాచారాన్ని ఎవరూ చూడ‌కుండా ఉండ‌డం  కోసం ఫ్రెండ్స్‌కు మాత్ర‌మే అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో  వేరే వాళ్లు మ‌న  డేటాను యాక్సిస్ చేసే  అవ‌కాశం ఉండ‌దు. ప‌బ్లిక్ అనే ఆప్ష‌న్ ఉంటే మీకు సంబంధించి అంతా  స‌మాచారం అంద‌రికి తెలిసిపోతుంది. కాబ‌ట్టి ప్రైవ‌సీ విష‌యంలో అజాగ్ర‌త్తగా ఉండ‌కూడ‌దు.

జన రంజకమైన వార్తలు