• తాజా వార్తలు

ఫేస్ బుక్ మెసేంజర్ లైట్ వెర్షన్ ఇండియాకు ఎందుకు రాలేదంటే..?


ఫేస్ బుక్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తన మెసేంజర్ యాప్ కు లైట్ వెర్షన్ ను విడుదల చేసింది. ఫేస్ బుక్ మెసేంజర్ లైట్ పేరుతో దీన్ని 132 దేశాల్లో విడుదల చేశారు. వియత్నాం, నైజీరియా, పెరూ, టర్కీ, జర్మనీ, జపాన్ వంటి 132 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే... ఇండియాలో మాత్రం ఇంకా అందుబాటులోకి తేలేదు.
ఎవరి కోసం..
ప్రపంచమంతా ఇంటర్నెట్ విస్తరించినా వేగం విషయంలో మాత్రం చాలా దేశాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇంటర్నెట్ వేగం బాగానే ఉంటున్నా ఇప్పుడిప్పుడే సాంకేతికంగా, ఆర్థికంగా బలపడుతున్న దేశాల్లో మాత్రం ఇంకా ఇంటర్నెట్ వేగమందుకోలేదు. అలాంటి చోట్ల ఎక్కువ ఫీచర్లు ఉంటే ఓపెన్ కావడం నుంచి వినియోగం వరకూ అన్నిటికీ ఇబ్బందే. అదే లైట్ వెర్షన్ ఉంటే సులభంగా ఉంటుంది. ఫేస్ బుక్ మెసేంజర్ లైట్ వెర్షన్ ను గత అక్టోబరులో తొలిసారిగా శ్రీలంక, ట్యునీసియా, మలేసియా, కెన్యా, వెనెజులాల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మొత్తం 132 దేశాలకు విస్తరించారు.

జియో వల్లే భారత్ ను లెక్కేయలేదు..
చాలా దేశాల్లో 3జీ సేవలు కూడా లేవు. భారత్ వంటి దేశాల్లోనే గత ఆర్నెళ్లుగానే 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వేగం పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ లోనూ మంచి వేగమున్న ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. మొబైల్ ఇంటర్నెట్ అయితే జియో రాకతో వేగమందుకుంది. ఈ కారణంగా ఇండియాలో ఇంటర్నెట్ వేగం విషయంలో గతంలో ఉన్న పరిస్థితి మారింది. అందుకే ఇక్కడ ఈ లైట్ వెర్షన్ ను రిలీజ్ చేయలేదని భావిస్తున్నారు.

ఏం ఉంటాయి.. ఏం ఉండవు..
సాధారణ ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో ఉండే ప్రధాన సేవలన్నీ ఇందులో ఉంటాయి. మెసేజింగ్, కెమేరా ఎఫెక్ట్స్ వంటివి ఉంటాయి. రియాక్షన్లు యాడ్ చేయడం... జియో ఫిల్టర్లు, కెమేరా ఎఫెక్టుల్లో కొన్ని అదనపు ఎఫెక్టులు వంటివి ఇందులో ఉండవు.

జన రంజకమైన వార్తలు