• తాజా వార్తలు
  •  

ప్రపంచంలో పావు వంతు మంది ఫేస్ బుక్ లోనే... 13 ఏళ్లలోనే ఫేస్ బుక్ రికార్డు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రికార్డు స్థాయి వినియోగదారులతో దూసుకుపోతోంది. ఇప్పటికే అత్యధిక వినియోగదారులు కలిగిన ఫేస్ బుక్ ఇప్పుడు మరో రికార్డు స్థాపించింది. ప్రపంచంలోని పావు వంతుకు పైగా జనాభా ఫేస్ బుక్ అకౌంట్లను కలిగి ఉంది. తాజా లెక్కల ప్రకారం ఏకంగా 200 కోట్ల మందికి ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి.

కాగా ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. యాక్టివ్ యూజర్ల సంఖ్యలో ప్రతి నెలా భారీ పెరుగుదల నమోదవుతోంది.  ఈమేరకు ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నవోమి గ్లీట్ ప్రకటించారు. 

కాగా మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ను స్థాపించి 13 సంవత్సరాలైంది. 2012 అక్టోబరులో 100 కోట్ల మంది యూజర్ల సంఖ్యను చేరుకోగా అక్కడికి అయిదేళ్లు కూడా కాకుండానే మరో 100 కోట్ల మంది వినియోగదారులను పెంచుకోవడం విశేషం. 
 

జన రంజకమైన వార్తలు