• తాజా వార్తలు
  •  

సైలెంట్ స్పీచ్ సిస్టమ్.. త్వరలో ఫేస్ బుక్ కొత్త ఫీచర్


మనుషుల్లో కలవలేనివారు కూడా మనసు విప్పి మాట్లాడుకునేలా... మదిలో భావనలు వ్యక్తపరిచేలా... తమ సంతోషాలు, దు:ఖాలను అందరితో పంచుకునేలా వీలు కల్పించిన ఫేస్ బుక్ నిత్యం కొత్త ఫీచర్లతో అప్ డేట్ అవుతూ ఉంటుంది. అందుకోసం భారీ కసరత్తు చేస్తూ ఉంటుంది. తాజాగా ఫేస్ బుక్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. అది వింటే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే. మనసులో అనుకున్నది మాటల రూపంలో ఫేస్ బుక్ లో టైప్ అయ్యేలా ఈ కొత్త ఫీచర్ ను డెవలప్ చేస్తున్నారు. దీనికి సైలెంట్ స్పీచ్ సిస్టమ్ అని పేరు పెట్టారు.
కంపోజ్ చేసే పనేలేదు..
ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే ఫేస్‌బుక్ లో ఇకపై ప్రత్యేకంగా కంపోజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనసులో మాటలను డైరెక్టుగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అంటే.. మీరు ఏ అభిప్రాయాలనైతే వెల్లడించాలనుకుంటున్నారో.. వాటిని కంపోజ్ చేయకుండానే ఫేస్‌బుక్‌లో వ్యక్తపరచటానికి వీలవుతుందన్నమాట.
5 రెట్లు వేగం
మన మెదడు ప్రతీ సెకండుకు నాలుగు హైడెఫినేషన్ సినిమాలకు సమానమైన సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ, మాటల ద్వారా మనం వ్యక్తీకరించే సమాచారం చాలా తక్కువ. సాంకేతికంగా చెప్పాలంటే, 1980ల నాటి మోడెమ్‌కు సమానమైన సమాచారాన్ని మాత్రమే మన మాటలు వ్యక్తీకరించగలుగుతాయి. ఈ నేపథ్యంలో, మెదడు నుంచి డైరెక్టుగా టైప్ చేయటానికి వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంపై ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం టైప్ చేస్తున్న దానికి ఐదురెట్ల వేగంతో కంపోజ్ చేయవచ్చు. అసలే సోషల్ మీడియా శరవేగంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి అధునాత ఫీచర్లు అందుబాటులోకి వస్తే ఈ వేగం మరింత పెరగడం ఖాయం.

జన రంజకమైన వార్తలు