• తాజా వార్తలు
  •  

ఫేస్ బుక్ ఫీడ్ లో వచ్చిన టాప్ 10 మార్పులను గమనించారా?

ఫేస్ బుక్. ఇది ఒక అలవాటు అనండి, వ్యాపకం అనండి, ఎంటర్ టైన్ మెంట్ అనండి లేదా వ్యసనం అనండి. నేటి మానవ జేవితం లో ఇది ఒక నిత్యకృత్యం అయింది. అంతలా ఇది ఆధునిక జీవన శైలిని ప్రభావితం చేసింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవలసింది దీని అప్ డేట్ ల గురించి. ఇది మొదలైనప్పటినుండీ అనేక మార్లు అప్ డేట్ చేయబడింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ ల తో ముస్తాబవుతూ యూజర్ లకు సోషల్ మీడియా లో ఉన్న అసలైన ఆనందాన్ని పంచుతుంది. అయితే ఈ అప్ డేట్ లను కొంతమంది గమనిస్తారు. మరికొంత మంది వీటితో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లో ఫేస్ బుక్ తన న్యూస్ ఫీడ్ లో గత ఆరు నెలల కాలం లో చేసిన మార్పుల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. దీనిని చదివి ఆ మార్పులను మీ పేస్ బుక్ యొక్క న్యూస్ ఫీడ్ లో గమనించండి.

ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ దగ్గర నుండి వచ్చే పోస్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వడం

మార్క్ జుకర్ బర్గ్ దగ్గరనుండి వచ్చిన సరికొత్త ప్రకటన  ఇది. మన న్యూస్ ఫీడ్ లో ఉండే వివిధ రకాల ప్రకటనలు మరియు ప్రకటనేతర కాంటెంట్ యొక్క పరిమాణాన్ని తగ్గించి ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ దగ్గర నుండి వచ్చే కాంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

డెస్క్ టాప్ వెర్షన్ లో స్టోరీస్ ఫీచర్                                  

మరొక ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ఇన్ స్టా గ్రం లో బాగా పాపులర్ అయిన స్టోరీస్ ఫీచర్ ను న్యూస్ ఫీడ్ యొక్క పై భాగం లో జత చేయడం జరిగింది. దీనికోసం ఇది అనేకరకాల స్టిక్కర్లు, మిగతా ఫీచర్ లను కూడా యాడ్ చేసింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఫేస్ బుక్ యొక్క డెస్క్ టాప్ వెర్షన్ లో టెస్టింగ్ లో ఉన్నది.

క్లిక్ ఆధారిత వీడియో లను తగ్గించడం

 మీరు మీ న్యూస్ ఫీడ్ లో సీరియస్ గా ఏదో చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక వీడియో వస్తుంది. దానిపై క్లిక్ చేసే లోపే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. అందులో ఉండేదంతా ఫేక్ న్యూసే. ఇలాంటి క్లిక్ ఆధారిత వీడియో లను ఇకపై ఫేస్ బుక్ తగ్గించనుంది.

తగ్గిపోనున్న ఎంగేజ్ మెంట్ పోస్ట్ లు

పైన చెప్పుకున్న విధంగానే ఇది కూడా మరొక చికాకు తెప్పించే అంశం. మన న్యూస్ ఫీడ్ లో ఏదో ఒక అంశం పోస్ట్ అవుతుంది. దానిని చూడడం చూడకపోవడం మన ఇష్టం. అయితే మీరు దీనిని అంగీకరిస్తే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి అనే కొన్ని రకాల విసుగు తెప్పించే పోస్ట్ లు వస్తాయి. ఇలాంటి వాటిని కూడా ఫేస్ బుక్ మన న్యూస్ ఫీడ్ లో తగ్గించనుంది.

ట్రస్ట్ ఇండికేటర్ లు

గత నవంబర్ లో ఫేస్ బుక్ ట్రస్ట్ ఇండికేటర్ లను ప్రారంభించింది. స్టొరీ యొక్క మీడియా ఆర్గనైజేషన్ కి సంబందించిన సమాచారాన్ని రీడర్ లు చదవగలిగే అవకాశాన్ని ఈ ట్రస్ట్ ఇండికేటర్ లు కల్పిస్తాయి. ఈ సమాచారాన్ని యూజర్ లు షేర్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.

వృత్తాకార ప్రొఫైల్ పిక్చర్ లు

యూజర్ ల ప్రొఫైల్ పిక్చర్ లను చతురస్రాకారం నుండి వృత్తాకారం లోనికి మార్చింది. ఈ ఫ్లాట్ ఫాం కు చిన్న చిన్న మార్పులను కూడా సూచించింది. పోస్ట్ లలో ఉండే బ్లూ బార్ లో కూడా ఇది మార్పులు చేసింది.

నోటిఫికేషన్ లను మ్యూట్ చేసేందుకు స్నూజ్ ఫీచర్    

మన న్యూస్ ఫీడ్ లో, నోటిఫికేషన్ లపై మనకు పూర్తి నియంత్రణ ఉండే విధంగా స్నూజ్ అనే ఒక కొత్త ఫీచర్ ను ఫేస్ బుక్ ప్రవేశపెట్టింది. దీనిని ఉపయోగించి యూజర్ లు ఒక వ్యక్తిని గానీ, పేజి ని గానీ లేదా గ్రూప్ ని గానీ తాత్కాలికంగా ఒక 30 రోజుల పాటు అన్ ఫాలో చేయవచ్చు.

రెండు భాగాలైన న్యూస్ ఫీడ్  

ఫేస్ బుక్ తన న్యూస్ ఫీడ్ ను రెండు విభాగాలుగా విభజించింది. ఒక భాగంలో ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్ లవద్ద నుండి వచ్చే పోస్ట్ లకు ప్రాధాన్యత ఇస్తే మరొక విభాగం లో అడ్వర్టైజ్మెంట్లు, పబ్లిషర్ ల వద్ద నుండి వచ్చే పోస్ట్ లకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికీ ఇంకా అధికారికంగా లాంచ్ చేయబడలేదు.

ఫేస్ బుక్ అడ్వర్టైజ్మెంట్ల నుండి వాట్స్ అప్ మెసేజింగ్

 మీ న్యూస్ ఫీడ్ లో ఉండే అడ్వర్టైజర్ ల వాట్స్ అప్ బటన్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అడ్వర్టైజర్ యొక్క వాట్స్ అప్ చాట్ కు జంప్ అయ్యే ఫీచర్ ను కూడా పేస్ బుక్ ఈ మధ్యనే ప్రవేశపెట్టింది.

 మెయిన్ యాప్ లో ‘ ఇన్ టు డే ‘ సెక్షన్

ఇది అన్నింటికంటే రీసెంట్ ఫీచర్. ఇది ప్రపంచవ్యాప్తంగా సెలెక్టెడ్ సిటీ లలో టెస్టింగ్ చేయబడుతుంది. ఈ సెక్షన్ లో ప్రధానంగా లోకల్ న్యూస్, ఈవెంట్ లు, ప్రకటనలు లాంటివి ఉంటాయి.  

జన రంజకమైన వార్తలు