• తాజా వార్తలు

మీ గురించి ఫేస్ బుక్ కు తెలిసిన 98 నిజాలు

సోషల్ మీడియా ను ఉపయోగించేటపుడు మన ప్రైవసీ గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిదేమో? ఈ కథనం చదివితే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. మన గురించి మనకు కూడా తెలియని 98 నిజాలు ఫేస్ బుక్ కు తెలుసు అంటే ఇది మనలను ఏ స్థాయిలో ఫాలో అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మనం చేసే ప్రతీ యాక్టివిటీని ఫేస్ బుక్ అనుక్షణం ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సింపుల్! మన ప్రొఫైల్ లోనే కొంతవరకూ విషయాలు ఉంటాయి.మన ఫేస్ బుక్ పేజి లో మనం చేసే లైక్ లు, కామెంట్ లు, షేర్ లను బట్టి మన ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. అలాగే మనం వాడే డివైస్ ఎకౌంటు ను బట్టి లొకేషన్ సెట్టింగ్ లు, మన ఫోన్ యొక్క బ్రాండ్, ఇంటర్ నెట్ కనెక్షన్ వివరాలు తెలిసిపోతాయి. అలాగే మనం ఫేస్ బుక్ తో ఉన్నపుడు కొన్ని వెబ్ సైట్ లను చూస్తూ ఉంటాము. వీటిని బట్టి మనం ఎలాంటి వెబ్ సైట్ లను చూడడానికి  ఇష్టపడుతున్నాము అనే దానిని విశ్లేషణ చేసి మన టేస్ట్ పై ఒక అంచనా కు వస్తుంది. ఇలా ఒకటేమిటి ఫేస్ బుక్ లో మనం చేసే ప్రతీ చిన్న పనిని కూడా అంచనా వేసి మన గురించి మనకే తెలియని 98 నిజాలను ఫేస్ బుక్ కనిపెట్టింది. అవేమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

  1. లొకేషన్
  2. వయసు
  3. జనరేషన్
  4. లింగము
  5. భాష
  6. విద్యాభ్యాసం
  7. చదివిన ప్రదేశం
  8. పాఠశాల
  9. జాతి
  10. ఆదాయం
  11. ఆస్తిపాస్తులు
  12. ఇంటి విలువ
  13. ఇంటి పరిమాణం
  14. ఇంటి వైశాల్యం
  15. మీరు ఇల్లు కట్టిన సంవత్సరం
  16. ఇంటి రకం
  17. కొత్త సంబందాలు
  18. మీ పుట్టిన రోజు మరియు వివాహ వార్షికోత్సవం
  19. మీరు ఇంటి నుండి దూరంగా ఉంటున్నారా? దగ్గరగా ఉంటున్నారా?
  20. మీ స్నేహితుల యొక్క పుట్టినరోజులు ఇతర కార్యకలాపాలు
  21. సుదూర బంధాలలో ఉన్న యూజర్ లు
  22. కొత్త ఉద్యోగాలలో ఉన్న యూజర్ లు
  23. కొత్త జంటలు
  24. కొత్తగా పెళ్ళైన యూజర్ లు
  25. పుట్టిన రోజు దగ్గర లో ఉన్న యూజర్ లు
  26. ఇప్పుడే వెళ్ళిపోయిన యూజర్ లు
  27. తలిదండ్రులు
  28. శిశువు కోసం ఎదురుచూస్తున్న తలిదండ్రులు
  29. వివిధ రకాల తల్లులు
  30. రాజకీయాలపై ఆసక్తి
  31. ఉదారావాదులా?కాదా?
  32. మీ రిలేషన్ షిప్ యొక్క స్థితి
  33. మీరు ఎవరికోసం పని చేస్తున్నారు?
  34. పరిశ్రమ
  35. ఉద్యోగం
  36. మీ ఆఫీస్ ఎలాంటిది  ?
  37. ఆసక్తులు
  38. మీ ద్విచక్రవాహనాల గురించి
  39. మీరు కార్ కొనాలి అనుకుంటున్నారా?
  40. ఈ మధ్య కార్ యొక్క విడిభాగాలు ఏమైనా కొన్నారా?
  41. కార్ సర్వీసింగ్ కు ఇద్దామానుకుంటున్నారా?
  42. మీరు నడిపే కార్ యొక్క బ్రాండ్
  43. మీరు కార్ కొన్న సంవత్సరం
  44. మీ కార్ యొక్క వయసు
  45. మీరు మీ తర్వాతి కార్ పై ఎంత వెచ్చించాలి అనుకుంటున్నారు?
  46. ఎక్కడ కొనాలి అనుకుంటున్నారు?
  47. మీ కంపెనీ లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?
  48. చిన్న వ్యాపారాల యజమానులు
  49. మేనేజ్ మెంట్ లో మరియు ఎక్జిక్యూటివ్ లుగా పనిచేసే యూజర్ లు
  50. ఎక్కడైనా దానం చేసారా?
  51. OS
  52. ఫేస్ బుక్ తో ఆడుతారా?
  53. ఫేస్ బుక్ లో ఈవెంట్ లు క్రియేట్ చేస్తారా?
  54. ఫేస్ బుక్ లో పేమెంట్ లు చేశారా?
  55. ఫేస్ బుక్  పై సగటు కంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారా?
  56. ఫేస్ బుక్ పేజి ల అడ్మినిస్ట్రేషన్
  57. ఫేస్ బుక్ కు రీసెంట్ గా అప్ లోడ్ చేసిన ఫోటోలు
  58.  వీడియో గేమ్ కన్సోల్ ల ఓనర్ లు
  59. ఇంటర్ నెట్ నావిగేటర్
  60. ఈ మెయిల్ సర్వీస్
  61. టెక్నాలజీ ని ఎలా ఉపయోగిస్తున్నారు?
  62. దేశ బహిష్కరణ జరిగిందా?
  63. మీరు ఏదైనా క్రెడిట్ యూనియన్ లేదా బ్యాంకు కు చెందినవారా?
  64. ఇన్వెస్టర్ లు
  65. క్రెడిట్ లైన్ ల సంఖ్య
  66. మీకు ఉన్న యాక్టివ్ క్రెడిట్ కార్డు లు
  67. మీ క్రెడిట్ కార్డు రకం
  68. డెబిట్ కార్డు యూజర్ లు
  69. క్రెడిట్ కార్డు లో గల ఫిక్సెడ్ బాలన్స్
  70. రేడియో వింటున్నారా ?
  71. టెలివిజన్ ప్రోగ్రాం ల ప్రాధాన్యత
  72. మొబైల్ డివైస్ యూజర్ లు
  73. ఇంటర్ నెట్ కనెక్షన్ యొక్క రకం 
  74. తాజాగా మొబైల్ ను కొనుగోలు చేసిన యూజర్ లు
  75. మొబైల్ నుండి ఇంటర్ నెట్ ఉపయోగించే యూజర్ లు
  76. కూపన్ లు డిస్కౌంట్ లు ఉపయోగించే యూజర్ లు
  77. మీరు ఇంట్లో ధరించే దుస్తుల రకాలు
  78. మీరు ఎక్కువ ఖరీదు చేసిన సంవత్సరం
  79. బీర్,వైన్ లాంటివి తాజాగా కొన్నారా?
  80. నిత్యావసరాలను కొనుగోలు చేసిన యూజర్ లు
  81. సౌందర్య సాధనాలను కొనుగోలు చేసిన యూజర్ లు
  82. మెడిసిన్లను కొనుగోలు చేసిన యూజర్ లు
  83. ఇంటి కి సంబందించిన వస్తువులను కొనుగోలు చేసిన యూజర్ లు
  84. పిల్లలకోసం, పెంపుడు జంతువుల కోసం ఎక్కువగా ఖర్చుపెట్టే యూజర్ లు
  85. ఆన్ లైన్ లో కొనే యూజర్ లు
  86. మీరు తాజాగా వెళ్ళిన రెస్టారెంట్
  87. ఆఫర్ లకు ఎలా స్పందిస్తున్నారు?
  88. మీరు ఎప్పుడూ వెళ్ళీ స్టోర్
  89. మీ ఇంట్లో ఎంతకాలం ఉన్నారు?
  90. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు?
  91. ఒలింపిక్ గేమ్స్, ఫుట్ బాల్ తదితరాలలో ఆసక్తి ఉందా?
  92. మీరు రీసెంట్ గా చేసిన ట్రావెల్
  93. ఉద్యోగం నిమిత్తం ట్రావెల్ చేసారా?
  94. మీరు హాలి డేస్ ను గడిపే ప్రదేశం
  95. మీరు తాజాగా వెళ్లి వచ్చిన ట్రిప్
  96. ట్రావెల్ యాప్ ను ఉపయోగిస్తారా?
  97. టైం షేర్ ఉందా?
  98. పిల్లలు, పెంపుడు జంతువుల పట్ల మీ వైఖరి

 

జన రంజకమైన వార్తలు