• తాజా వార్తలు
  •  

ఫ్లిప్‌కార్ట్‌కు వ‌న్‌డే సీఈవో

ఒకే ఒక్క‌డు సినిమాలో ఒక్క రోజు సీఎంను చూశాం. మేక్ ఎ విష్ ఆర్గ‌నైజేష‌న్ చిన్నారుల కోరిక తీర్చ‌డానికి ఒక్క‌రోజు పోలీస్ క‌మిష‌న‌ర్‌ను చేసిన ఇన్సిడెంట్లు చూశాం. ఇప్పుడు ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక్క రోజు సీఈవో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఉద్యోగుల నుంచి ఒక‌రిని ఎంపిక చేసి వ‌న్‌డే సీఈవోగా నియ‌మిస్తామ‌ని ప్ర‌క‌టించింది.
వ‌న్‌డే సీఈవోగా ప‌ని చేయ‌డానికి ఆసక్తి ఉన్న ఎంప్లాయిస్ అప్ల‌యి చేసుకోవాల‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. వ‌చ్చిన అప్లికేష‌న్స్‌లో నుంచి ఒక ఎంప్లాయిని సెలెక్ట్ చేసి ఒక్క‌రోజు సీఈవోగా నియ‌మిస్తారు. సంస్థ సీఈవోగా క‌ళ్యాణ్ కృష్ణ‌మూర్తి చేసే ప‌నుల‌న్నీ ఆ ఒక్క‌రోజు సీఈవో చేస్తార‌ని చెప్పింది. సంస్థ ప‌దో యానివ‌ర్సిరీ (బిగ్ 10)ని పుర‌స్క‌రించుకుని ఈ అరుదైన అవ‌కాశం ఇస్తామ‌ని ఫ్లిప్‌కార్ట్ ఎనౌన్స్ చేసింది.
కింది స్థాయి ఉద్యోగుల్లో ఉత్సాహం
ఫ్లిప్‌కార్ట్‌కు దాదాపు 3వేల మంది ఎంప్లాయిస్ ఉన్నారు. వీరిలో 150 మంది ఇప్ప‌టికే వ‌న్‌డే సీఈవో ఆఫ‌ర్‌కు అప్లయి చేశారు. ఫ్లిప్‌కార్ట్ టాప్ మేనేజ్‌మెంట్ కు, దిగువ స్థాయి ఎంప్లాయిస్‌కు మ‌ధ్య రిలేష‌న్ పెంచ‌డానికి ఈ చ‌ర్య ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

జన రంజకమైన వార్తలు