• తాజా వార్తలు
  •  

ఐఫోన్ 6పై ఫ్లిప్ కార్టులో భారీ డిస్కౌంట్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్టు ఆపిల్‌ ఐఫోన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫాదర్స్ డే నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆపిల్‌ ఐ ఫోన్‌ 6 ధర భారీగా తగ్గించింది. అతి తక్కువ ధరలో ప్రత్యేక ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 8 నుంచి జూన్ 10 వరకు విక్రయించనున్నట్లు ఫ్లిప్ కార్టు ప్రకటించింది. అయితే.. తొలుత ధర ఎంతన్న విషయంలో కొద్దిగా క్లూ మాత్రమే ఇచ్చి సస్పెన్స్ మెంటైన్ చేసినా గురువారం ఉదయం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.
రూ.2-,999 లకే అందించనున్నట్లు ప్రకటనల్లో పేర్కొంటుడడంతో 20 వేల పై ధరే అని అంతా అర్థం చేసుకున్నారు. ఇప్పటికే 24,990 ధర ఫ్లిప్ కార్టులో ఉండడంతో దీన్ని 20999, 21999 కానీ ఉండొచ్చని భావించారు. అనుకున్నట్లుగానే గురువారం ధరను కూడా ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. రూ. 21,999గా నిర్ణయించింది.
కాగా దీనిపై క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ బజ్ కార్డుపై 5 శాతం డిస్కౌంటు ఇస్తుండగా.. ఎస్బీఐ కార్డులపై 3, 6 నెలల 0 పర్సంట్ ఈఎంఐ ఆఫర్ ఇస్తోంది.
వరల్డ్‌ బెస్ట్‌ డాడ్ పేరుతో ఫ్లిప్ కార్ట్ ఈ డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూన్‌ 8 గురువారం, జూన్‌ 10 శనివారం వరకు ఈ తగ్గింపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది. ప్రస్తుతం, ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32 జీబి) ఫ్లిప్కార్ట్‌ 32 శాతం డిస్కౌంటుతో రూ.24,990 కు అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 6 (16 జిబి) సిల్వర్, గోల్డ్ వేరియంట్లు, వరుసగా రూ.36,990, రూ. 36,499 గాఉన్నాయి. అదనంగా రూ.15వేలదాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. భారత్‌లోఫాదర్స్‌ డేను ఈ సంవత్సరం జూన్ 18 న జరుపుకుంటున్నారు. అక్కడికి పది రోజుల ముందే ఫ్లిప్ కార్టు ఆ అకేషన్ ను వాడుకుంటోంది.

జన రంజకమైన వార్తలు