• తాజా వార్తలు
  •  

శాంసంగ్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నవారికి ఫ్లిప్ కార్టులో డిస్కౌంట్ ఆఫర్లు ఇవీ..

ఈకామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్టు ఆఫర్లతో ముంచెత్తుతోంది. ఇటీవలే బిగ్ 10 సేల్ పెట్టిన ఈ సంస్థ ఆ తరువాత జీఎస్టీ నేపథ్యంలోనూ భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది. శాంసంగ్ కార్నివాల్ పెట్టింది.
ఫోన్లపై రూ.5 వేల వరకు తగ్గింపు
ఈ శాంసంగ్ కార్నివాల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ.5వేల వరకు యూజర్లకు డిస్కౌంట్ లభిస్తుండగా, ఎల్‌ఈడీ టీవీలు, మొబైల్ యాక్ససరీలపై కూడా ఆఫర్లను అందిస్తున్నది.
ఏ మొబైల్ ఎంత ధరలో...
గెలాక్సీ సీ9 ప్రో.... రూ.31900
ఆన్ నెక్స్ట్.... 14900
ఆన్ 7... రూ.7690
ఆన్ 5... రూ.6690
48 శాతం తగ్గింపు
గేర్ ఎస్2 స్మార్టు వాచ్ పై 48 శాతం, ఎల్‌ఈడీ టీవీలపై 38 శాతం, మానిటర్లు, ప్రింటర్లపై 28 శాతం వరకు డిస్కౌంట్లను శాంసంగ్ అందిస్తోంది.
ఇవీ ధరలు..
గేర్ ఎస్ 2 స్మార్ట్ వాచ్... 14900
గేర్ వీఆర్... 3999
క్రెడిట్ కార్డు ఆఫర్లు అదనం
దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి రూ.5వేల పైబడి షాపింగ్ చేసిన వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.అయితే.... ఈ స్పెషల్ కార్నివాల్ సేల్ జూన్ 15 వరకే ఉంటుంది.