• తాజా వార్తలు
  •  

మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18 వ‌ర‌కు భారీ ఆన్‌లైన్ సేల్‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది ఈ ఆన్‌లైన్ సంస్థ‌. ఐతే త‌న క‌న్నా ముందే అమేజాన్ 11 నుంచి భారీ మేళాను నిర్వ‌హిస్తుండ‌డంతో ఈసారి తమ‌కు గ‌ట్టిపోటీ త‌ప్ప‌ద‌ని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. అమేజాన్ మేళా పూర్త‌య్యాక ప‌రిణామాల‌ను బ‌ట్టి అప్ప‌టిక‌ప్పుడు డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌లోనూ మార్పులు చేర్పులు చేయాల‌ని ఫ్లిప్‌కార్ట్ అనుకుంటోంది. దీనికి త‌గ్గట్టే ఇప్ప‌టికే ఆ సంస్థ మీడియా ద్వారా భారీగా ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టింది.

ఈ సేల్ ప్ర‌త్యేక‌త‌లేంటంటే..
1. బిగ్ 10 సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్ర‌కారం హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో చేసిన కొనుగోళ్ల‌కు క్యాష్‌బ్యాక్ ల‌భించ‌నుంది.
2. శాంసంగ్, ఒప్పొ, లెనొవొ కంపెనీలు ఈ సేల్‌కు భాగ‌స్వాములుగా వ్య‌వహ‌రిస్తున్నాయి
3. ఈ సేల్ న‌డిచే స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు కాంటెస్ట్‌లు నిర్వ‌హించి బహుమ‌తులు ఇవ్వ‌నుంది.

సేల్‌లో ఏం ఉన్నాయంటే..
ఈ సేల్‌లో భాగ‌స్వాములైనందు వ‌ల్ల శాంసంగ్‌, ఒప్పొ, వివొ, లెనొవొలు త‌మ స్మార్ట్‌ఫోన్ల‌పై భారీగా డిస్కౌంట్లు ఇవ్వ‌నున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల‌తో కొంటే క్యాష్‌బ్యాక్ అద‌నంగా ల‌భించ‌నుంది. అంతేకాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రిప్‌కు వెళ్లే అవ‌కాశాన్ని కూడా ఈ కంపెనీలు క‌ల్పిస్తున్నాయి. ల‌క్కీ క‌స్ట‌మ‌ర్ల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో ఉచితంగా షాపింగ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఐ ఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌, గూగుల్ పిక్స‌ల్, మోటో జి5 ప్ల‌స్‌, మోటో ఎక్స్ ప్లే, శాంసంగ్ ఆన్ నెక్ట్స్ ఫోన్ల‌పై క‌నీం 10 శాతం డిస్కౌంట్ పొందే అవ‌కాశాలున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 1, శాంసంగ్ గేర్ ఎస్‌2, మోటో 360 స్పోర్ట్‌, ఫిట్‌బిట్ ఛార్జ్ హెచ్ లాంటి స్మార్ట్‌వాచ్‌ల‌పై కూడా భారీగా త‌గ్గింపు ధ‌ర‌లు ఉండ‌నున్నాయి.

వినియోగ‌దారుల‌కు పండ‌గే
బిగ్ 10 సేల్ ఒక ర‌కంగా వినియోగ‌దారుల‌కు పండ‌గే. ఎందుకంటే అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ మ‌ధ్య భారీగా పోటీ ఉండ‌డంతో క‌చ్చితంగా త‌క్క‌వ ధ‌ర‌ల‌కే ప్రొడెక్ట్ ఇవ్వాల‌ని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. అమేజాన్ ప్ర‌క‌టించిన ధ‌ర‌ల కంటే తాము ఇంకా త‌గ్గింపు ధ‌ర‌ల‌తో సేల్ నిర్వ‌హిస్తే స్పంద‌న భారీగా ఉంటుంద‌నేది ఈ ఈకామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ వ్యూహం. దానిలో భాగంగానే అమేజాన్ సేల్‌ను అంచ‌నా వేసి ఆ త‌ర్వాత ఆఫ‌ర్ల‌లో మార్పులు చేయాల‌ని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. దీనికి తోడు సేల్ న‌డిచే స‌మ‌యంలో కాంటెస్ట్‌లు నిర్వ‌హించి వినియోగ‌దారుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తులు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేస్తోంది.

జన రంజకమైన వార్తలు