• తాజా వార్తలు
  •  

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొంటే బై బ్యాక్ గ్యారంటీ ఆఫ‌ర్!

ఫ్లిప్ కార్ట్ త‌న 10వ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా అనైన్స్ చేసిన బిగ్ 10 సేల్ లో మొబైల్ ఫోన్ల‌పై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌ల‌తోపాటు మ‌రో బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్ ఇవ్వ‌బోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు కొన్న‌వారికి బై బ్యాక్ గ్యారంటీ ఆఫ‌ర్‌ను కూడా ఇవ్వ‌నుంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐల‌తోపాటు ఈ ఆఫ‌ర్ కూడా క‌లిస్తే స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు రెట్టింప‌వుతాయ‌ని ఫ్లిప్‌కార్ట్ అంచ‌నా వేస్తోంది.
బై బ్యాక్ గ్యారంటీ అంటే..
బై బ్యాక్ గ్యారంటీ అంటే ఫోన్‌కు ఒక ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకున్న‌ట్లే అంటారు టెక్ మార్కెట్ ఎక్స్‌ప‌ర్ట్‌లు. ఈ ఆఫ‌ర్ కింద ఫోన్ కొన్న ఆరు నుంచి ఎనిమిది నెల‌ల్లోగా దాన్ని తిరిగి అమ్మాల‌నుకుంటే ఫ్లిప్‌కార్టే మీ ద‌గ్గ‌ర కొనుక్కుంటుంది. ఫోన్ కాస్ట్‌లో 35% నుంచి 50% వ‌ర‌కు ఇచ్చి మీ దగ్గ‌ర నుంచి ఫోన్ కొంటామ‌ని హామీ ఇస్తుంద‌న్న మాట‌. అయితే ఫోన్ ఏ కండిష‌న్లో ఉండాలి అనే దానికి ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ ఉంటాయి. త‌ర‌చూ ఫోన్లు మార్చేవారే టార్గెట్‌గా ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు మార్కెట్ వర్గాల అంచనా.
స‌గం మోడల్స్‌పై ఆఫ‌ర్స్‌
బిగ్‌సేల్‌లో భాగంగా అమ్మే స్మార్ట్‌ఫోన్ల‌లో స‌గానికి పైగా మోడ‌ల్స్‌కు బై బ్యాక్ గ్యారంటీ ఆఫ‌ర్‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. 10 వేల నుంచి 80 వేల రూపాయ‌ల ప్రైస్ రేంజ్‌లో ఉన్నలీడింగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల‌కే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. మార్చి నుంచి మోటో జీ 5పై బై బ్యాక్ గ్యారంటీ ఆఫ‌ర్‌ను ప్ర‌యోగాత్మ‌కంగా చేసి స‌క్సెస్‌ఫుల్ అయిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్‌లో చాలా మొబైల్ మోడల్స్‌పై దీన్ని ప్ర‌యోగించ‌బోతుంది. అంతేకాదు ఈ సేల్ ముగిసిన త‌ర్వాత మొబైల్స్‌పై బై బ్యాక్ గ్యారంటీ ఆఫ‌ర్‌ను ప‌ర్మినెంట్ ఫీచ‌ర్‌గా మార్చ‌బోతుంద‌ని, అయితే ఈ ఆఫ‌ర్‌లో ఫోన్ కొనాలంటే ప్రైస్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఫ్లిప్‌కార్ట్ అఫీషియ‌ల్స్ చెబుతున్నారు.