• తాజా వార్తలు
  •  

శాంసంగ్ మొబైల్ ఫెస్ట్.. ఈ ఒక్క‌రోజే

మొబైల్ ఫోన్ త‌యారీ కంపెనీల మ‌ధ్య పెరుగుతున్న పోటీకి వినియోగ‌దారుల‌కు పంట పండిస్తోంది. సేల్స్ పెంచుకోవ‌డానికి కంపెనీలు ఒక‌దాన్ని మించి ఒక‌టి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇటీవ‌లే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ పేరుతో షియోమి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను బోల్డ‌న్ని ఆఫ‌ర్లు ఇచ్చింది. ఇప్పుడు కొరియా స్మార్ట్ ఫోన్ లెజండ్ శాంసంగ్ మొబైల్ ఫెస్టివల్ నిర్వ‌హిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో కలిసి మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న ఈ ఫెస్ట్‌కు ఈ రోజే (ఏప్రిల్ 13) చివ‌రి రోజు. భ‌లే భ‌లే ఆఫ‌ర్లు.. ఫెస్ట్ లో భాగంగా శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్లు, భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు న్నాయి. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. 18,490 రూపాయల ధ‌ర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3 వేల రూపాయల డిస్కౌంట్ పై 15,490లకు అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్చేంజ్ పై అయితే రూ.14,500 ధరను తగ్గిస్తోంది. * శాంసంగ్ గెలాక్సీ జే5 అసలు ధర రూ.13,290. దీన్ని 10,990కే ఫెస్ట్‌లో కొనుక్కోవ‌చ్చు. ఎక్స్చేంజ్ పై ఏకంగా 10వేల రూపాయల వరకు తగ్గింపు ఇస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఎలాంటి ఈఎంఐ ధరలు లేకుండా ప్రారంభ ధర 1722 రూపాయలకు శాంసంగ్ ఫోన్లను పొందవచ్చు. గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్9, గెలాక్సీ సీ9ప్రొ పై కూడా కంపెనీ ఎక్స్చేంజ్, డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ మొబైల్ ఫెస్ట్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కంటే ఐడియా మంచి డేటా ప్యాక్‌ను అంద‌జేస్తోది. 1జీబీ డేటా రేటుకే 14జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం.. ఓసారి లుక్కేయండి..

జన రంజకమైన వార్తలు