• తాజా వార్తలు
  •  

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి వివో వీ5ప్ల‌స్‌

వివో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వీ5ప్ల‌స్ మొబైల్ ఫోన్ల‌ను ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి పెట్ట‌బోతోంది. మేట్ బ్లాక్ వీ5ప్ల‌స్ లిమిటెడ్ ఎడిష‌న్‌గా మార్కెట్‌లోకి రాబోతోంది. ధ‌ర 25,990 రూపాయ‌లు. ఈ-కామ‌ర్స్ ఫ్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ భాగ‌స్వామ్యంతో ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ ప‌ట్టు సంపాదించాల‌న్న‌ది వివో ప్లాన్‌. ఇప్ప‌టివ‌ర‌కు ఆఫ్‌లైన్ స్టోర్ల‌తో క‌స్ట‌మర్ల‌ను రీచ్ అవుతున్న వివో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌తో ఆన్‌లైన్ మార్కెట్‌పైనా దృష్టి పెట్ట‌బోతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మార్కెట్లు రెండింటిలోనూ గ్రిప్ సాధించ‌డానికి ఇదో అవ‌కాశ‌మ‌ని వివో చెబుతోంది. సెల్ఫీకి సూప‌ర్ 16 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ (రియ‌ర్‌) కెమెరాతో వ‌చ్చే వీ5ప్ల‌స్లో ఇక సెల్ఫీ కెమెరా ఏకంగా 20 మెగాపిక్సెల్స్‌. దీంతో అదిరిపోయే సెల్ఫీలు తీసుకోవ‌చ్చ‌ని వివో చెబుతోంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ తో వ‌స్తుంది. 5.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పిక్చ‌ర్స్ మంచి క్వాలిటీతో క‌న‌ప‌డ‌తాయి. బ్యాట‌రీ 3,055 ఎంఏహెచ్‌. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌తో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంద‌ని వివో చెప్పింది.

జన రంజకమైన వార్తలు