• తాజా వార్తలు
  •  

హై ఎండ్ ఫోన్ల‌పై ఫ్లిప్ కార్ట్ లో త‌గ్గింపు ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా?

హై ఎండ్ ఫోన్ల‌పై ఫ్లిప్ కార్టులో భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారు. 24వ తేదీ వ‌ర‌కు ఉంటున్న ఈ సేల్‌లో ఐఫోన్ 7 సహా గూగుల్ పిక్సల్, మోటో జడ్ వంటి హై ప‌ర్ఫార్మింగ్ స్మార్ట్‌ఫోన్లపై చెప్పుకోద‌గ్గ స్థాయిలో డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ)పై ఏకంగా రూ.22వేల తగ్గింపు ప్ర‌క‌టించ‌డం విశేషం. దీనికి తోడు మరో రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నారు. 

మిగ‌తా హై ఎండ్ ఫోన్ల‌పైనా ఇలాగే లాభ‌దాయ‌క‌మైన ఆఫ‌ర్లు ఉన్నాయి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉండ‌డంతో ఈ సేల్ గిట్టుబాటేన‌ని వినియోగదారులు అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్ల‌లో ఏ ఫోన్ ధ‌ర ఎంత ఉంది... ఎంత త‌గ్గించార‌న్న‌ది మీ కోసం..

ఐఫోన్ మోడ‌ళ్ల ధ‌ర‌లు ఇలా..
* ఐఫోన్ 7 (128 జీబీ) ధర రూ.51,499 (రూ.18,501 తగ్గింది)
* ఐఫోన్ 7 (32 జీబీ) ధర రూ.42,499 (రూ.17,501 తగ్గింది) 
* ఐఫోన్ 6ఎస్ (32 జీబీ) ధర రూ.32,999 (రూ.15వేలు తగ్గింది) 
* ఐఫోన్ 6 ధర రూ.22,999 (రూ.13,991 తగ్గింది) 
* ఐఫోన్ ఎస్‌ఈ (32 జీబీ) ధర రూ.21,999 (రూ.5,201 తగ్గింది) 
* ఐఫోన్ 5ఎస్ ధర రూ.14,999 (రూ.5,001 తగ్గింది) 

మిగ‌తావి కొన్ని..
* గూగుల్ పిక్సల్ (32 జీబీ) ధర రూ.44వేలు (రూ.13వేలు తగ్గింది)
* శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రొ ధర రూ.31,900 (రూ.5వేలు తగ్గింది) 
* మోటో జడ్ ధర రూ. 29,999 (రూ.10వేలు తగ్గింది) 
* లెనోవో జడ్2 ప్లస్ (32 జీబీ) - రూ.9,999 (రూ.5వేలు తగ్గింది)