• తాజా వార్తలు
  •  

ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్


యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మొద‌లైన ఈ స్పెష‌ల్ సేల్‌.. మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌, ఇంకా ఇత‌ర ఆపిల్ డివైస్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు.

ఆ మోడల్ పై 40 వేల డిస్కౌంట్
అన్నిటికంటే బెస్ట్ ఆఫర్ ఐఫోన్ 7 256 జీబీ వేరియంట్‌పై ఉంది. ఆ మోడల్ ధర 20 వేలు తగ్గించారు. ఈ ఫోన్ సిల్వ‌ర్‌, బ్లాక్‌, జెట్ బ్లాక్‌, గోల్డ్‌, రోజ్ గోల్డ్ వేరియంట్స్‌.. రూ.59999కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ కింద రూ.19 వేల వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్ కూడా ల‌భించ‌నుంది. యాక్సిస్ బ్యాంక్ బ‌జ్ క్రెడిట్ కార్డ్స్‌పై అద‌నంగా మ‌రో 5 శాతం త‌గ్గింపు వర్తిస్తుంది. ఎక్స్సేంచి ధర మొత్తం రూ.19 వేలు వర్తించింది అనుకుంటే మొత్తంగా రూ.40 వేల వరకు తగ్గినట్లవుతుంది.

రూ.26 వేలకే ఐఫోన్ 6
మిగ‌తా ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్ల‌స్ వేరియంట్స్‌పైనా డిస్కౌంట్ల‌, ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్లు ఉన్నాయి. ఐఫోన్ 6 16 జీబీ వేరియంట్ అయితే ఏకంగా రూ.26010 డిస్కౌంట్‌పై ఇస్తున్న‌ది ఫ్లిప్‌కార్ట్‌. అంటే ఇది కేవ‌లం రూ.25990కే ల‌భించ‌నుంది. ఎక్స్‌చేంజ్‌, యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ డిస్కౌంట్లు కూడా దీనికి వ‌ర్తిస్తాయి. ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 5ఎస్‌ల‌పైనా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ మూడు రోజులు ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రొ రూ.54990కే ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భిస్తుంది. ఇక వివిధ డెబిట్‌, క్రెడిట్ కార్డ్స్‌పై కూడా రూ.1500 వ‌ర‌కు డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ల‌పై 35 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఉన్నాయి.