• తాజా వార్తలు
  •  

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఆపర్లుప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ యూజర్ల కోసం సమ్మర్ షాపింగ్ డేస్‌ సేల్ ను ప్రారంభించింది. మంగళవారమే దీన్ని ప్రారంభించగా... ఈ రోజు నుంచి ఆపర్లు వెల్లువెత్తాయి. మే 4వ తేదీ వరకు అంటే బుధవారం వరకు ఈ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తోంది.

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 32 జీబీ వేరియెంట్ రూ.18,490 ఉండగా, అదిప్పుడు రూ.14,900 కే లభిస్తోంది.

64 జీబీ వేరియెంట్ రూ.16,900 లకు లభ్యమవుతోంది. దీనిపై గరిష్టంగా రూ.16వేల వరకు ఎక్సేంజ్ ధరను కూడా ప్రకటించింది.

శాంసంగ్ ఆన్8 స్మార్ట్‌ఫోన్ 16 జీబీ మోడల్ రూ.13,490 ధరకు లభిస్తోంది. ఎక్సేంజ్‌లో అయితే దీనిపై గరిష్టంగా రూ.12,500 వరకు డిస్కౌంట్ లభ్యమవుతోంది.

మోటో జడ్ 64 జీబీ వేరియెంట్ రూ.39,999కు లభిస్తుండగా, రూ.16,999 ధర ఉన్న మోటో ఎక్స్ ప్లే 16 జీబీ వేరియెంట్ రూ.11,999 ధరకే లభిస్తోంది. 32 జీబీ వేరియెంట్ రూ.13,499 ధరకు లభిస్తోంది.

ఇవే కాకుండా గూగుల్ పిక్సల్, మోటో జీ5 ప్లస్, వివో వీ5, ఐఫోన్ 7, 7 ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఫోన్లపై, యాపిల్ వాచ్ సిరీస్ 1, శాంసంగ్ గేర్ ఎస్2, మోటో 360 స్పోర్ట్, ఫిట్‌బిట్ చార్జ్ హెచ్‌ఆర్ స్మార్ట్‌వాచ్‌లు, లెనోవో యోగా 3, లెనోవో యోగా ట్యాబ్ 3 ప్రొ, యాపిల్ ఐప్యాడ్ టాబ్లెట్లపై కూడా యూజర్లకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.