• తాజా వార్తలు

పేటీఎంలో లాయ‌ల్టీ పాయింట్లు సంపాదించ‌డం, రిడీమ్, యాక్సెప్ట్ చేయ‌డానికి గైడ్‌

డీమానిటైజేష‌న్‌తో ఇండియా మొత్తానికి ప‌రిచ‌య‌మైపోయిన పేటీఎం ఇప్పుడు కొత్త‌గా లాయ‌ల్టీ పాయింట్స్ సిస్ట‌మ్‌ను తీసుకొచ్చింది. దీనిలో పాయింట్స్ ఎలా సంపాదించుకోవాలి?  వాటిని ఎలా రిడీమ్ చేసుకోవాలి?  లేదంటే వాటిని బ్యాంక్ అకౌంట్‌లోకి ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియ‌జెప్ప‌డానికే ఈ ఆర్టిక‌ల్‌. చదివేయండి మ‌రి..  
 లాయ‌ల్టీ పాయింట్స్ అంటే? 
ఇది కూడా క్యాష్ బ్యాక్‌లాంటిదే. ఏదైనా ట్రాన్సాక్ష‌న్ చేస్తున్న‌ప్పుడు ప్రోమోకోడ్ అప్ల‌య్ చేస్తారు క‌దా. అప్పుడు వ‌చ్చే మ‌నీ ఈ లాయల్టీ పాయింట్స్ రూపంలో మీ వాలెట్‌లో యాడ్ అవుతుంది. ఒక పాయింట్ ఒక రూపాయికి స‌మానం. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వాడుతున్న‌ప్పుడు ఇస్తున్న పాయింట్ల‌లా అన్న‌మాట‌. 
ఎలా సంపాదించాలి? 
* పేటీఎం యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
*  ఆఫ‌ర్ పిరియ‌డ్‌లో ట్రాన్సాక్ష‌న్ చేయండి లేదంటే ప్రోమో కోడ్‌ను అప్ల‌యి చేయండి. 
* ట్రాన్సాక్ష‌న్  కంప్లీట్ చేయండి. వెంట‌నే మీకు లాయ‌ల్టీ పాయింట్స్ యాడ్ అవుతాయి.
ఎలా రిడీమ్ చేసుకోవాలి?
మీరు త‌ర్వాత ట్రాన్సాక్ష‌న్ చేసేట‌ప్పుడు చెక్ అవుట్ పేజీలో పాయింట్స్‌ను సెలెక్ట్ చేసి రిడీమ్ చేసుకోవ‌చ్చు.
*  మీ పాయింట్ల  మొత్తాన్ని ఒకేసారి రిడీమ్ చేసుకోవ‌చ్చు.  మినిమం ఇంత ట్రాన్సాక్ష‌న్ చేయాల‌ని లిమిట్ లేదు.  
* స్కాన్ అండ్ పే ద్వారా రిడీమ్ చేసుకోవ‌చ్చు. బ‌స్ టికెట్స్‌, సినిమా టికెట్స్‌, ప‌ర్చేజ్‌లు ఇలా పేటీఎంలో ఏ ట్రాన్సాక్ష‌న్‌కైనా వాడుకోవ‌చ్చు. 
ఇదీ ష‌ర‌తు
* మీ రెగ్యుల‌ర్ క్యాష్ బ్యాక్‌లో వ‌చ్చే మ‌నీని బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. వేరే పేటీఎం అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు.  కానీ ఈ లాయల్టీ పాయింట్ల‌ను అలా ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌లేం. రెగ్యుల‌ర్ క్యాష్‌బ్యాక్‌కి, దీనికి ఉన్న ప్ర‌ధాన‌మైన తేడా ఇదే.
 

జన రంజకమైన వార్తలు