• తాజా వార్తలు
  •  

మీ టీవీలో బిల్ట్ ఇన్ వైఫై లేకున్నా ఇంట‌ర్నెట్‌కు క‌నెక్ట్ చేయ‌డానికి గైడ్‌

ఇంట‌ర్నెట్‌ను టీవీలో కూడా వాడుకోవ‌డానికి వీలుగా స్మార్ట్‌టీవీలు ఇప్పుడు మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి.  ఇప్పుడంటే స్మార్ట్‌టీవీకి, ఎల్ఈడీ టీవీకి ప్రైస్ వేరియేష‌న్ పెద్ద‌గా లేదు. దీంతో స్మార్ట్ టీవీల సేల్స్ ఇండియాలో 40% పెరిగింది. 2017లో ఇండియాలో స్మార్ట్‌టీవీల బిజినెస్ 75వేల కోట్ల‌కు చేరుతుంద‌ని ఓ సంస్థ లెక్క‌గ‌ట్టింది.  అయితే  కొన్నాళ్ల కింద వ‌ర‌కు  మామూలు ఎల్ఈడీ ధ‌ర కంటే స్మార్ట్ టీవీ ధ‌ర 50% వ‌ర‌కు ఎక్కువ ఉండేది. అందుకే చాలా మంది స్మార్ట్ టీవీ కొనాల‌నుకున్నా ఎల్ఈడీతో స‌ర్దుకుపోయేవారు.  ఇలాంటివారు  ఎల్ఈడీ టీవీలో కూడా ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీని  పొందవ‌చ్చు. బిల్ట్ ఇన్ వైఫై లేకున్నా టీవీని ఇంట‌ర్నెట్‌కు క‌నెక్ట్ చేయ‌డం ఎలాగో చూడండి.   
స్క్రీన్ మిర్ర‌రింగ్ 
  మీ టీవీలో ఈ ఫీచ‌ర్ ఉంటే ఇన్‌బిల్ట్ వైఫై లేక‌పోయినా ఫోన్‌లోనూ, టీవీలోనూ కూడా స్క్రీన్ మిర్ర‌ర్ ఆప్ష‌న్ ఓపెన్ చేసి  టీవీతో క‌నెక్ట్ చేస్తే చాలు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వ‌చ్చే ఇంట‌ర్నెట్ టీవీ తెర‌పై వాడుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్ 4.4.2 దాని త‌ర్వాత వ‌చ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో స్క్రీన్ మిర్ర‌రింగ్ ఆప్ష‌న్స్ ఉన్నాయి. 
 క్రోమ్ కాస్ట్ 
మీ టీవీ స్క్రీన్ మిర్ర‌రింగ్‌ను స‌పోర్ట్ చేయ‌ని మోడ‌ల్ అయితే క్రోమ్ కాస్ట్ లాంటి డివైస్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీకి క‌నెక్ట్ చేయ‌డానికి ప‌నికొస్తాయి. ఇదొక్క‌టే కాదు మీ స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్‌లోని కంటెంట్‌ను మీ ఎల్ఈడీ టీవీలో చూడడానికి ఇలాంటి డివైస్‌లు చాలా ఉన్నాయి.  నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటివి స్ట్రీమింగ్ చేయ‌డానికి మీ టీవీ స్మార్ట్ టీవీ అయి ఉండ‌క్క‌ర్లేదు. ఇందుకోసం కూడా మార్కెట్లో చాలా డివైస్‌లు ఉన్నాయి.  
 

విజ్ఞానం బార్ విశేషాలు