• తాజా వార్తలు

అస‌లు బ్యాట‌రీ ఛార్జింగ్ చేసే విధానానికి కంప్లీట్ గైడ్ మీకోసం..

సెల్ ఫోన్ ఇండియాలోకి వచ్చి ఎన్నాళ్లయినా గత ఐదారేళ్లుగా అందరికీ అందివచ్చేసింది.  స్మార్ట్ ఫోన్ల రాకతో చాలా మందికి ఫోనే ప్రపంచమైపోయింది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీల పోటీ పుణ్యమా అని డేటా చౌకవడంతో చేతిలో ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెఓన్ ఉంటే చాలు దాదాపు అన్ని పనులూ చక్కబెట్టేసుకోగలుగుతున్నాం.  కానీ ఎంత గొప్ప సెల్ కొన్నా మనల్ని అవతలి వ్యక్తి అడిగే మొదటి ప్రశ్న‌.. బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎలా ఉంది? అనే. బ్యాట‌రీ బ్యాక‌ప్, దాని మ‌న్నికకు మ‌నం ఛార్జింగ్ చేసే విధానం కూడా కార‌ణాలే. అస‌లు ఫోన్‌ను ఎలా ఛార్జింగ్ చేయాల‌నే అంశాల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల ఎనాలిస్‌లున్నాయి.  మీ ఫోన్‌ను ఎలా ఛార్జింగ్ పెట్టాలి? ఎలా ఛార్జింగ్ చేయ‌కూడ‌దో చెప్పేఅల్టిమేట్ గైడ్ మీకోసం...
క్యాడెక్స్ అనే కంపెనీ బ్యాట‌రీ ఛార్జింగ్ విధానంపైన ఇన్‌డెప్త్ స్ట‌డీ చేసింది. బ్యాట‌రీ యూనివ‌ర్సిటీ అనే వెబ్‌సైట్‌లో దీని గురించి బోల్డంత ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చింది.  దీని ప్రకారం..
సెల్‌ఫోన్‌లో ఉండే బ్యాట‌రీని ఛార్జింగ్ చేసే విధానం ఇదీ..
కొద్దిగా టైం దొరికినా ఛార్జింగ్ పెట్టండి
కొద్ది కొద్దిగా టైమ్ ఛార్జింగ్ పెడితే బ్యాట‌రీ తొంద‌ర‌గా పాడ‌వుతుంది అనేది అపోహే. ఏ కొంచెం టైం దొరికినా ఛార్జింగ్ పెట్టండి.
బ్యాటరీ పూర్తిగా డిస్‌ఛార్జి కానివ్వ‌కండి
బ్యాట‌రీని పూర్తిగా జీరో వ‌ర‌కు వాడేయ‌కండి. అలాచేస్తే బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతుంది. బ్యాట‌రీ మొత్తం అయిపోయే ప‌రిస్థితి వ‌స్తే కొద్దిగా ఛార్జింగ్ ఉండ‌గానే స్విచ్ ఆఫ్ చేసేయండి. 
65% నుంచి 75% శాతం ఛార్జింగ్ ఉంటేనే బెట‌ర్‌
65% నుంచి 75% శాతం ఛార్జింగ్ ఎప్పుడూ బ్యాట‌రీలో ఉంచ‌గ‌లిగితే బ్యాట‌రీ ఎక్కువ కాలం మ‌న్న‌తుంద‌ని బ్యాట‌రీ యూనివ‌ర్సిటీ చెబుతుంది. అంత‌కంటే త‌గ్గితే వెంట‌నే ఛార్జింగ్ పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించండి.
క‌నీసం 45% ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి
65% ఉంచ‌లేని ప‌రిస్థితుల్లో క‌నీసం45% ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. 25% నుంచి 75% వ‌ర‌కు ఛార్జింగ్ ఉన్నా బ్యాట‌రీ లైఫ్ బాగుంటుంది. 
పూర్తిగా ఛార్జింగ్ పెట్ట‌కండి
బ్యాట‌రీని పూర్తిగా అంటే 100% ఛార్జింగ్ పెట్ట‌డం కూడా మంచిది కాదు.  మ‌న సెల్‌ఫోన్ల‌లో ఎక్కువ‌గా ఉండే లిథియం అయాన్ బ్యాట‌రీ  ఫుల్ ఛార్జింగ్ అవ‌స‌రం ఉండ‌దు. ముఖ్యంగా  బాగా త‌క్కువ ఛార్జింగ్ ఉన్న‌ప్పుడు దాన్నిఎప్పుడూ ఫుల్ ఛార్జింగ్ అయ్యే వ‌ర‌కు ఛార్జ్ చేయ‌కూడ‌దు.  ఇలా చేస్తే హైవోల్టేజి స్ట్రెస్ బ్యాట‌రీ లైఫ్‌ను దెబ్బ‌తీస్తుంది. 
రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వ‌దిలేయ‌కండి
ఇది చాలామంది చేస్తున్న పొర‌పాటే. రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వ‌దిలేస్తారు.అలాచేస్తే బ్యాట‌రీ 100% నిండిపోతుంది. అది బ్యాట‌రీ లైఫ్‌ను త‌గ్గిస్తుంది.ఒక‌వేళ మీకు ఉద‌యం ఛార్జింగ్ పెట్ట‌డానికి టైం దొర‌క‌ద‌నుకుంటే రాత్రి వేళ ఛార్జింగ్ పెట్టండి.కానీ 100 శాతం నిండ‌క‌ముందే దాన్నిఅన్‌ప్ల‌గ్ చేయండి.
ఇవ‌న్నీ పాటిస్తే బ్యాటరీ కూడా ఫోన్‌తోపాటే చాలాకాలం పాటు మ‌న్నుతుంది. లేదంటే ఫోన్ కండిష‌న్ బాగుండ‌గానే కొత్త బ్యాట‌రీ వేయాల్సిన అవ‌స‌రం రావ‌చ్చు. అది మీకు అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చే కాదు. ఒరిజినల్ దొరుకుతుందా లేదా అనే టెన్ష‌న్ కూడా వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు