• తాజా వార్తలు
  •  

ఈమెయిల్ నుంచి పెద్ద ఫైల్స్‌ పంప‌డానికి నాలుగు సులువైన మార్గాలు..

మ‌నం రోజు వారీ ప‌నుల్లో భాగంగా ఈమెయిల్స్‌ను ఉప‌యోగిస్తుంటాం. అయితే ఒక్కోసారి పెద్ద సైజులో ఫైల్స్ పంపాల్సి రావొచ్చు. ఇలాంట‌ప్పుడు మ‌నం ఉప‌యోగించే ఈమెయిల్ ద్వారా ప‌ని కాదు. ఒకేసారి ఇంత పెద్ద  ఫైల్స్‌ను పంపేందుకు ఏ ఫార్మాట్ ప‌ర్మిట్ ఇవ్వ‌దు. మ‌రి మ‌నం ఎక్కువ ప‌రిమాణంలో ఫైల్స్‌ను పంపాలంటే ఎలా? .. దీనికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి.. ఇవేంటో చూద్దాం..

డ్రాప్‌బాక్స్ జీమెయిల్‌
లార్జ్ ఫైల్స్‌ను పంప‌డానికి లేదా బ‌ల్క్‌గా సేవ్ చేయ‌డం కోసం గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది డ్రాప్‌బాక్స్‌. జీమెయిల్ నుంచి ఫైల్స్‌ను ఏక మొత్తంలో పంపించుకునేందుకు ఇదో మంచి ఆప్ష‌న్‌. ఈ ఎక్స్‌టెన్ష‌న్ సెట్ చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం.  ఒక‌సారి సెట్ చేసుకున్న త‌ర్వాత డ్రాప్‌బాక్స్ ఐకాన్ ఒక‌టి మీ డెస్క్‌టాప్ క్రింద భాగంలో కుడిచేతి వైపు క‌నిపిస్తుంది.  ఆ త‌ర్వాత మీ ఫైల్స్‌ను డ్రాప్ బాక్స్ ఐకాన్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా లోడ్ చేసుకోవ‌చ్చు.  ఈ డ్రాప్‌బాక్స్ క్లిక్ చేసి ఫైల్‌ను సెల‌క్ట్ చేసుకుని ఇన్‌స‌ర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు. మీరు ఎవ‌రికి పంపాల‌నుకుంటున్నారో వారికి ఆ ఫైల్ వెళ్లిపోతుంది.

ఫైర్‌ఫాక్స్ సెండ్‌
డ్రాప్‌బాక్స్ త‌ర్వాత ఎక్కువ ప్రాచుర్చంలో ఉన్న ఫైల్ ఫైర్‌ఫాక్స్ సెండ్‌. మొజిల్లా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ఆగ‌స్టులోనే ఈ కొత్త ఫైల్ సెండింగ్  ఆప్ష‌న్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఇదో ఎన్‌క్రిప్టెడ్ ఫైల్ ట్రాన్స‌ఫ‌ర్ సిస్ట‌మ్‌. దీని వ‌ల్ల మ‌న ఫైల్స్ చాలా సుర‌క్షితంగా ఉంటాయ‌ని మొజిల్లా చెబుతోంది.  1 జీబీ సైజు వ‌ర‌కు ఫైల్స్‌ను ఒకేసారి పంపే అవ‌కాశం క‌ల్పిస్తోందిది. దీనికుండే సెకండ‌రీ అథంటికేష‌న్ లేయ‌ర్ వ‌ల్ల కూడా మ‌న ఫైల్స్ సెక్యూరిటీకి ఎలాంటి ఢోకా ఉండ‌దు. 

డ్రాప్ సెండ్‌
భారీ సైజులో ఉన్న ఫైల్స్‌ను పంప‌డానికి మ‌రో ఆప్స‌న్ డ్రాప్‌సెండ్‌. ఫైర్ ఫాక్స్ సెండ్‌లాగా దీని ప‌ని తీరు ఉంటుంది. ఫ్రీ వెర్ష‌న్ కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఈ ఫ్రీ వెర్ష‌న్ ఫైల్స్ లిమిట్‌ను బ‌ట్టి ఉంటుంది. అంతేకాదు ఒక నెల‌లో ఎన్నిసార్లు ఫైల్స్‌ను పంపేందుకు డ్రాప్‌సెండ్‌ను ఉయోగించాం అన్న దానిపై కూడా ఫ్రీ వెర్ష‌న్ యూసేజ్ ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే ఫైర్‌సెండ్ మారిదిగా కాకుండా  డ్రాప్ సెండ్‌లో మీరు క‌చ్చితంగా రిజిస్ట‌ర్ కావాల్సి ఉంటుంది. 

వికో ఫోర్టియో
ఈ జాబితాలో చివ‌రి ఆప్ష‌న్ వికో ఫోర్టియో. ఫైర్‌ఫాక్స్ సెండ్ మారిదిగానే ప‌ని చేస్తుందిది. ఈమెయిల్స్ ద్వారా పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్స్‌ను పంప‌డానికి ఇదో మంచి ప్ర‌త్యామ్నాయం. దీనిని ఉప‌యోగించ‌డం చాలా సులభం. ఎందుకంటే వికో ఫోర్టియోలో రెండే ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి డౌన్‌లోడ్ ఫైల్‌.. రెండు అప్‌లోడ్ ఫైల్‌.