• తాజా వార్తలు

ఫ్రీ వైఫై కావాలా? ఈ ఉచిత వైఫై హాట్‌స్పాట్ ఫైండ‌ర్స్ మీకోసం..

ఆధునిక ప్ర‌పంచంలో వైఫై వాడ‌కం బాగా పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఆఫీసుల్లో మాత్ర‌మే వాడే వైఫై ఇప్పుడు ఇళ్ల‌లోకి వ‌చ్చేసింది. ఎక్కువ‌శాతం ఇళ్ల‌లో వైఫై హాట్‌స్పాట్‌లు ఉంటున్నాయి. షాపింగ్ మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేష‌న్లు, సినిమా హాల్స్ లాంటి ప‌బ్లిక్ ప్లేసుల‌కు వెళ్లినా కూడా ఇప్పుడు వైఫై ల‌భిస్తుంది. కొన్ని స్టేట్స్‌లో ఉచిత ప‌బ్లిక్ వైఫైని అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో పెడుతున్నారు. అయితే మీకు కూడా ఉచిత వైఫై కావాలి? అయితే అందుకు కొన్ని హాట్‌స్పాట్ ఫైండ‌ర్స్ ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం..

వైఫై మ్యాప్‌
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైజ్‌ల‌లో ఈ వైఫై మ్యాప్ టూల్ ల‌భ్యం అవుతుంది. ఇది చాలా ఎక్స్‌టెన్సీవ్ యాప్‌. 100 మిలియ‌న్ల వైఫై పాయింట్ల‌ను ఎంపిక చేసుకోవ‌డానికి ఈ వైఫై మ్యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎక్కువ‌శాతం ప్ర‌యాణాల్లో గ‌డిపే వారికి ఇది అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈ యాప్ వెస్ట్ర‌న్ కంట్రీస్‌లో ల‌భ్యం అవుతోంది. మిడిల్ ఈస్ట్‌, సెంట్ర‌ల్ ఆసియా, ఆఫ్రికా, ర‌ష్యా, ఈస్ట్ర‌న్ యూరోప్‌లోనూ ఇది సేవ‌లు అందిస్తోంది.

అవాస్ట్ వైఫై ఫైండ‌ర్‌
టెక్నాల‌జీపై అవగాహ‌న ఉన్న వారికి అవాస్డ్ బ్రాండ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఫ్రీ యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ల‌లో అవాస్ట్ కూడా ఒక‌టి. ఇది ఇప్పుడు వైఫై ఫైండ‌ర్‌గా కూడా సేవ‌లు అందిస్తోంది. మీరు ఈ యాప్‌ను వేసుకుంటే.. మీ ఫోన్ జీపీఎస్ ఆధారంగా మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న వైఫై హాట్‌స్పాట్‌ల‌ను ఇది చూపిస్తుంది. అంతేకాదు ఆ క‌నెక్ష‌న్ ఓపెన్ యాక్సిస్‌లో ఉందా లేక పాస్‌వ‌ర్డ్ కావాలా కూడా చెబుతుంది.

ఓపెన్ సిగ్న‌ల్ (వైఫై మ్యాప‌ర్‌)
వైఫై మ్యాప‌ర్‌తో సుల‌భంగా వైఫై హాట్‌స్పాట్‌ల‌ను క‌నుక్కోవ‌చ్చు. మ‌న‌కు 100 మిలియ‌న్ల వైఫై హాట్‌స్పాట్‌లు అనే ప‌దం చాలా పెద్ద‌గా క‌నిపించొచ్చు. కానీ ఓపెన్ సిగ్న‌ల్ వైఫై మ్యాప‌ర్‌తో ఏకంగా 500 మిలియ‌న్ల వైఫై హాట్‌స్పాట్‌ల‌ను క‌నుక్కోవ‌చ్చంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌లారా?  కానీ ఇది నిజం.  దీనిలో ఫిల్ట‌ర్ కూడా ఉంది. టైప్‌, స్సీడ్‌, క్వాలిటీ, క‌నెక్ష‌న్ బ‌ట్టి రిజ‌ల్ట్స్ ఫిల్ట‌ర్ చేయ‌చ్చు.

వైఫై హాట్‌స్పాట్ స్కాన‌ర్‌
మ‌న‌కు వైఫై ఉన్నా ఒక్కోసారి సిగ్న‌ల్ చూపించ‌దు. మ‌న డివైజ్ వైఫై స్కానింగ్‌కు అందుదు. ఇలాంటి స్థితిలో వైఫై హాట్‌స్పాట్ స్కాన‌ర్ అద్భుతంగా ప‌ని చేస్తుంది. విండోస్‌లో బేసిక్ వైఫై స్కాన‌ర్ ఇప్ప‌టికే ఉంది. ఈ స్కాన‌ర్‌తో మీకు నెట్‌వ‌ర్క్ పేరుతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌, చానెల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, మాక్ అడ్రెస్ అన్నింటిని వైఫై స్కాన‌ర్ చూపిస్తుంది. 

వైపై స్పేస్‌
వెబ్ బేస్డ్ హాట్‌స్సాట్ ఫైండ‌ర్స్ చాలా త‌క్కువ‌గా ఉంటాయి.  అంటే మీరు ఒక చోట వైఫై ఉప‌యోగించిన త‌ర్వాత అక్క‌డ డిస్ క‌నెక్ట్ చేసే వేరే చోట‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు వైఫై స్పేస్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న 20 మిలియ‌న్ల వైఫై హాట్‌స్పాట్‌ల‌ను ఇది లొకేట్ చేస్తుంది. మీకు కావాల్సిన లొకేష‌న్ల‌ను సెర్చ్ చేసుకోచ‌వచ్చు.  
 

జన రంజకమైన వార్తలు